జూన్ 19వ తేదీన చరిత్రలోకి వెళితే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. కాగా నేడు జన్మించిన ఆ ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి.

 

 

 జేమ్స్ వాట్ జననం : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అయిన జేమ్స్ వాట్ 1736 లో జన్మించారు. ఈయన భౌతిక శాస్త్రంలో ఎంతో పేరు గడించారు. ఈయన  1819 సంవత్సరంలో మరణించారు.

 

 

 బాలాంత్రపు రజనీకాంతరావు జననం : బహుముఖ ప్రజ్ఞాశాలి గాయకుడు వాగ్గేయకారుడు ఆయన బాలాంత్రపు రజనీకాంతరావు 1920 జనవరి 19వ తేదీన జన్మించారు. ఈయన  గొప్ప రచయిత స్వరకర్త తొలితరం సంగీత దర్శకులు బాలాంత్రపు రజనీకాంతరావు గారు. స్వరకర్తగా గీత రచయితగా సంచాలకుడిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియో శ్రోతులను  ఎంతగానో అలరించారు బాలాంత్రపు రజనీకాంతరావు.

 

 

 జీవ జననం : తెలుగు చిత్ర పరిశ్రమలు ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలో నటించారు జీవ. తనదైన విలనిజంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకంగా వెయ్యి సినిమాలకు పైగా నటించారు జీవ. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించిన జీవ... కమెడియన్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. రామ్ గోపాల్ వర్మకృష్ణవంశీపూరి జగన్నాథ్ లాంటి దర్శకులు సినిమాల్లో కూడా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు జీవ . ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

 

 

 వరుణ్ తేజ్ : మెగా కుటుంబం నుంచి హీరోగా పరిచయం అయిన వారిలో వరుణ్ తేజ్  ఒకరు. మెగా హీరోగా  నాగబాబు నట వారసునిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన వరుణ్  ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలు అందుకొంటున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో  చేసి తనదైన సత్తా చాటాడు వరుణ్ తేజ్. 1990 జనవరి 19వ తేదీన వరుణ్ తేజ్ హైదరాబాద్ లో జన్మించారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో  ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్  అని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన నట విశ్వరూపాన్ని చూపించారు వరుణ్ తేజ్.

 

 

 ఇక తాజాగా గద్దల కొండ గణేష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి  అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులందరినీ మెప్పించి  బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు వరుణ్ తేజ్. ఎన్నో విభిన్నమైన కథాంశంతో ఉన్న సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుకున్నాడు. అంతకు ముందుగా మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఎఫ్ 2 చిత్రంలో వెంకటేష్ తో పాటు కలిసి నటించారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ పదవ సినిమాగా బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా  ఈ సినిమా ఏప్రిల్ 9,  2020 న విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: