వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిందా అంటే అవుననే అంటున్నారు.  తెలుగుదేశం పార్టీ నేతలను ఇరుకున పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.  అమరావతి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిన విషయాన్ని బయటపెట్టారు.  ఇన్సైడర్ ట్రేడింగ్ కారణంగా అమరావతిలో అభివృద్ధి ఆగిపోయింది.  తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు. బినామీ పేర్లతో భూములను కొనుగోలు చేయడంతో వైపాకా దీనిపై దృష్టి పెట్టింది.  


ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేయడానికి వైకాపా రంగం సిద్ధం చేస్తున్నది.  ఇప్పటికే ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వ్యక్తులను ప్రభుత్వం గుర్తించి వాళ్ళను టార్గెట్ చేసింది.  వారిపై వివిధ రకాల కేసులను నమోదు చేసేందుకు సిద్ధం అయ్యింది.  ఇక వారిపై ఎలాంటి కేసులు నమోదు చెయ్యొచ్చో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.  


ఐపీసీ సెక్షన్ 418: లావాదేవీకి సంబంధించి ప్రయోజనాలను పరిరక్షించి తీరాల్సి ఉన్నా, నష్టం వస్తుందని తెలిసీ మోసానికి పాల్పడటం. ఇందుకు మూడేళ్ల జైలు శిక్ష. జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. ఐపీసీ సెక్షన్ 420: వంచన లేదా మోసం ద్వారా ఆస్తిని బదలాయించడం. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ విధించవచ్చు.ఐపీసీ సెక్షన్ 403: దురుద్దేశంతో ఆస్తిని దుర్వినియోగం చేయడం. ఈ నేరానికి గాను రెండేళ్ల జైలు శిక్ష. జరిమానా. రెండూ విధించవచ్చు.


వీటితో పాటుగా మరిన్ని సెక్షన్ల పేరుతో కేసులు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది.  అవేమంటే, ఐపీసీ సెక్షన్ 406: నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం. ఇందుకు గాను మూడేళ్ల జైలు శిక్ష. జరిమానా. రెండూ విధించవచ్చు. ఐపీసీ సెక్షన్ 409: ఆస్తి విషయంలో పబ్లిక్‌ సర్వెంట్‌ లేదా బ్యాంకర్‌ లేదా వ్యాపారి, ఏజెంట్‌ నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం. ఇందుకు గాను పదేళ్ల జైలు శిక్ష, జరిమానా. రెండూ విధించవచ్చు.  ఇలా వివిధ సెక్షన్ల పేరుతో కేసులు పెట్టి శిక్షలు విధించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది.  అయితే, వీటిని తెలుగుదేశం పార్టీ నేతలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: