జనవరి 20 న చరిత్రలోకి వెళితే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి నేడు జన్మించిన ఆ ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 

 బందా కనకలింగేశ్వరరావు జననం : సుప్రసిద్ధ రంగస్థల నటుడు అయిన బందా కనకలింగేశ్వరరావు ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. ఈయన నాట్య కళా పోషకుడు కూడా. 1907 జనవరి 20వ తేదీన ఈయన కృష్ణా జిల్లాలోని ఆటపాక గ్రామంలో జన్మించారు. బందా కనకలింగేశ్వరరావు బహుముఖ ప్రజ్ఞాశాలి.రంగస్థల నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగు సినిమా ప్రపంచంలో మొదటి తరం సినిమాల్లో  ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక కూచిపూడి నాట్యం లో కూడా సుప్రసిద్ధుడు బందా కనకలింగేశ్వరరావు. కూచిపూడి నాట్య కల గురించి ప్రముఖ పత్రికల్లో వ్యాసాలు రాసి కూచిపూడి నాట్య కళ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేశారు. ఈయన 1968 డిసెంబర్ 3వ తేదీన మరణించారు. 

 

 

 బి.విఠలాచార్య జననం : జానపద బ్రహ్మగా పేరుపొందిన తెలుగు సినిమా దర్శకులు బీ. విట్టలాచార్య  1920 జనవరి 20 తేదీన జన్మించారు. ఎన్నో సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. తమిళ తెలుగు కన్నడ భాషల్లో ఏకంగా 70 చిత్రాలను రూపొందించారు బి.విఠలాచార్య. ఎన్నో జానపద చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. అప్పటికీ పరిమితమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన అసామాన్యమైన ప్రతిభను చూపించారు. తక్కువ ఖర్చుతోనే ప్రేక్షకులకు కనులకు ఇంపైన జానపద కళా ఖండాలను రూపొందించాడు.

 

 

 కృష్ణంరాజు : తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల రెబల్ స్టార్ గా మారిపోయిన హీరో కృష్ణంరాజు. 1940 జనవరి 20వ తేదీన జన్మించారు. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ కృష్ణంరాజు హీరోగా నటించిన సినిమాలలోని కొన్ని  డైలాగులను నేటి తరం సినిమాల్లో కూడా వాడుతూ ఉంటారు.  ఎన్నో సినిమాల్లో నటించి ఆనాటి కాలంలో స్టార్ హీరోగా కొనసాగారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు కృష్ణంరాజు. ప్రస్తుతం కృష్ణం రాజు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ప్రభాస్ రాజు... తెలుగు ప్రేక్షకులకు యంగ్ రెబల్ స్టార్ గా మారిపోయారు. 

 

 నరేష్ జననం : ప్రముఖ సినీ నటుడైన నరేష్ ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. ప్రముఖ నటి అయిన విజయనిర్మల కుమారుడు నరేష్. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన నరేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1960 జనవరి 20వ తేదీన జన్మించారు నరేష్.  జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన జంబలకడిపంబ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఎన్నో సినిమాల్లో హాస్యనటుడిగా కూడా నటించారు. 1972 సంవత్సరంలో పండంటి కాపురం సినిమాతో  బాల నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు నరేష్. అంతేకాకుండా ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: