మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అనడానికి ఓ ఉదాహరణ ఇది.  దేశం ఏదైనా సరే... మహిళలు మాత్రం అన్ని విషయాలు దూసుకుపోతున్నారు. వయసుతోను, వర్ణంతోను సంబంధం లేదు.  ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేసుకుంటూ పోతున్నారు.  ఇక రాజకీయాల్లో రాణించాలి అంటే తెలివి ఉంటె చాలు.  మాటలు చెప్పి చేయించుకునే ధైర్యం ఉంటె చాలు.  ఏదైనా చేయగలరు.  ఎంత దూరమైనా వెళ్ళగలరు.  వయసులో సంబంధం అవసరం లేదు.  


దీనిని రాజస్థాన్ కు చెందిన విద్యాదేవి అనే మహిళ నిరూపించింది.  ఇటీవలే రాజస్థాన్ లో సర్పంచ్ పదవులకు ఎన్నికలకు జరిగాయి.  ఈ ఎన్నికల్లో 97 సంవత్సరాల వయసు కలిగిన మహిళ సీకర్ జిల్లాలోని పురాణావాస్ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసింది. పురాణావాస్ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో 11 మంది మహిళలు పోటీ చేశారు.  అయితే, గ్రామప్రజలు మాత్రం విద్యాదేవి వైపు మొగ్గు చూపారు.  విద్యాదేవి తన సమీప ప్రత్యర్థి మీనా పై 207 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు.  


ఈ విజయంతో  విద్యాదేవి అత్యంత పెద్ద వయసులో పోటీ చేసి విజయం సాధించిన మహిళగా గుర్తింపు పొందింది.  ఆ వయసులో కూడా ఆమె చురుగ్గా ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించడం విశేషం.  గతంలో ఆమె భర్త కూడా ఆ గ్రామానికి సర్పంచ్ గా పనిచేశారు.  దాదాపు 25 సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేసిన ఘనత అయన సొంతం అని చెప్పాలి.  ఆమె వారసత్వంతోనే విద్యాదేవి సర్పంచ్ గా పోటీ చేసింది.  ఈ వయసులో పోటీ చేసిన తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. 


ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పింది.  గ్రామాన్ని అన్ని రంగాల్లో దూసుకుపోయేలా చేస్తానని చెప్పింది.  చురుగ్గా ఎన్నికల్లో పోటీ చేసిన విద్యాదేవికి ప్రతి ఒక్కరు అభిమానందనలు తెలియజేస్తున్నారు.  అంతేకాదు, ఆ వయసులో సర్పంచ్ గా ఎంపికైన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ వైరల్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నది.  ఏ వయసులోనైనా రాజకీయాల్లో రాణించవచ్చు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: