అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయింది ఏపీ రాజధాని వ్యవహారం. ఈ విషయంలో  ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్లలేక వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ ఇలా జగన్ మూడు ప్రాంతాలకు ప్రాధాన్యతను పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అమరావతి ప్రాంతంలోనే రాజధానిని ఉంచాలని మార్చడానికి కుదరదు అంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, మరి కొన్ని రాజకీయ పార్టీలు హడావుడి చేస్తున్నాయి. ఈ విషయంలో జగన్ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు. 


తాజాగా మూడు రాజధానుల బిల్లుని శాసనసభలో ఏ విధంగా ఆమోదింప చేయాలి అనే విషయంపై తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. శాసనసభలో కేవలం తీర్మానం చేసి కేంద్రానికి, సుప్రీం కోర్టుకు పంపిస్తే సరిపోతుందా ?  లేక మూడు రాజధానులను నోటిఫై చేస్తూ బిల్లు ఆమోదించుకుని దాని ప్రకారం ముందుకు వెళ్లడమా అనే విషయం పై జగన్ తో పాటు, పార్టీ కీలక నాయకులు, కొంతమంది అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత కొత్త రాజధానిని ఎంపిక చేసుకునే బాధ్యత 2014  లో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి అప్పగించింది.


 రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగానే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. దీనికి రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. కానీ ఒకసారి రాజధానిగా నోటిఫై అయిన తర్వాత తిరిగి మార్చాలంటే శాసనసభలో రాజధాని బిల్లును ప్రవేశపెట్టాలా లేక తీర్మానం చేస్తే సరిపోతుందా అనే సందేహం ఇప్పుడు జగన్ కు వ్యక్తమవుతోంది. ఒక బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారాలంటే అసెంబ్లీ, మండలి లో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ సంతకంతోనే నోటిఫై అవుతుంది. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలం ప్రభుత్వానికి ఉంది. 


ఈ విషయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మెజార్టీలో ఉంది. ఒకవేళ శాసనసభలో ఆమోదం పొందినా, శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందదు కాబట్టి  ఈ ప్రతిపాదనను జగన్ వ్యతిరేకిస్తున్నారు. బిల్లుకు బదులుగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి నోటిఫై చేయించుకుంటే సరిపోతుంది అనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా లోతుగా అధ్యయనం చేయాలని జగన్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: