ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం అమరావతి రాజధాని ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఏపీ రాజకీయాలకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అని సోషల్ మీడియాలో కొడుతుంటే గత నెల రోజుల నుండి అమరావతి రాజకీయాల గురించి మరియు అదే విధంగా అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అదే విధంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనలు గురించి వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్న ఈ విషయం అందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అత్యవసర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20న జరపాలని వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల అంశం గురించి ఏపీ ప్రజలకు అర్థమయ్యేరీతిలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అర్థమయ్యే రీతిలో వివరించడానికి అనుకున్న తరుణంలో జగన్ దూకుడుకి మోడీ బ్రేక్ వేసినట్లు ఏపీ రాజకీయాల వినపడుతున్న టాక్.

 

మేటర్ లోకి వెళ్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎం జగన్ ఢిల్లీ లో ప్రధాని మోడీ తో మరియు అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో బేటీ అవ్వడానికి రెడీ అయినట్లు అయితే ఇటువంటి తరుణంలో వాళ్ళిద్దరు జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మూడు రాజధానులు విషయంలో సీఎం జగన్ స్పీడ్ కి కళ్లెం వేస్తున్నట్లు సమాచారం.

 

అమరావతి రాజధాని విషయంలో ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు చేస్తున్న ఆందోళనలు నిరసనలు కరెక్ట్ అని వారికి మద్దతు తెలపడంతో ఈ విషయంలో జగన్ ని ఒంటరి చేయడానికి బిజెపి పార్టీ పెద్దలు జగన్ కి ఢిల్లీ వెళ్ళిన అపాయింట్మెంట్ ఇవ్వకుండా అమరావతి రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలకు లాక్ చేసినట్లు ఏపీ మరియు ఢిల్లీ మీడియా వర్గాల్లో వినబడుతున్న టాక్. మరి జగన్ అమరావతి రాజధాని విషయంలో రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: