2024 ఎన్నికలను టార్గెట్ చేసుకుని బిజెపి జనసేన పార్టీలు కలసి పని చేయడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఎప్పటి నుండి రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు అన్నీ ఎన్నికలలో కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ నేతలతో చేతులు కలిపి పొత్తుల పెట్టుకోవడానికి రెడీ అవడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ప్రశ్నిస్తాను ఆ డైలాగులు కొట్టి పాలిటిక్స్ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ఒకానొక సమయంలో తిరుపతిలో బిజెపి పార్టీ ని బండ బూతులు తిట్టిన పవన్ కళ్యాణ్ తాజాగా ఇటీవల బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భంలో మీడియాతో మాట్లాడుతున్న తరుణంలో ఏపీ స్పెషల్ స్టేటస్ పై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు పవన్.

 

మేటర్ లోకి వెళ్తే స్పెషల్ స్టేటస్ గురించి నన్ను కాదు 22 మంది వైసీపీ ఎంపీల ను అడగండి అని ఒక్కసారిగా చాలా దారుణంగా గతానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రశ్నించడానికి వచ్చాడా లేకపోతే పొత్తు పెట్టుకోవడానికి వచ్చాడా అంటూ సామాన్య జనులు మరికొంతమంది స్వయంగా పవన్ కళ్యాణ్ అభిమానులే తాజాగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు బట్టి చూస్తే భవిష్యత్తులో ప్రత్యేక హోదా విషయంలో బిజెపి ఇచ్చే ఆలోచనలో లేదన్నట్లు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అడిగే పరిస్థితుల్లో లేదన్నట్లు అర్థమవుతుంది.

 

ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ల పై కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు మాట్లాడుతూ రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావలసిన హక్కుల విషయంలో ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వారికే కాదు లేని వారికి కూడా బాధ్యత ఉంటుంది. ఆ మాటకొస్తే ఇది వరకు ప్రత్యేక హోదా కావాలని అడిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కు ఎంపీలు లేరు ఆ సమయంలో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారు కేంద్రంలో ఉన్న పార్టీతోనే చేతులు కలిపి రాజకీయాలు చేస్తున్నాడు కదా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నోరెత్తకపోతే జన్మలో తుడుచుకోలేని తప్పు పవన్ కళ్యాణ్ చేసినట్లవుతుందని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: