ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల  ప్రకటన చేసినప్పటి నుంచి రాజధానిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. రాజధాని రైతులందరూ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గత నెల రోజుల నుండి అమరావతి రైతులందరూ నిరసన బాట పట్టినప్పటికీ  కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తమ నిరీక్షణలో మరింత ఉధృతం చేశారు. ఇక నేడు అమరావతి ప్రాంతంలోని నలుగురు యువకులు ఏలూరులోని సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశారు. రాజధానిని  అమరావతి లోనే  కొనసాగించాలని లేకపోతే సెల్ టవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించారు. 

 

 

 స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తమ  వద్దకు వచ్చి  మాట్లాడేంత వరకు సెల్ టవర్ దిగం అంటూ హెచ్చరించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చామని..తమ గ్రామాలు బాగుండాలని రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాము. అమరావతికి ప్రధానమంత్రి మోదీ  స్వయంగా శంకుస్థాపన చేసి... ఇప్ప్పుడు  అమరావతిని మారుస్తాము అంటే ప్రశ్నించటం లేదు  అంటూ యువకులు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు మాతోనే  ఉన్నారు. రేపు కూడా అలాగే ఉండాలి. పవన్ కళ్యాణ్ రైతుల తరపున మాట్లాడుతూనే ఉండాలి. మాకు ఏ కులం పార్టీలు కాని లేవు పార్టీలతో మాకు అసలు సంబంధం లేదు...స్థానిక  ఎమ్మెల్యే అయిన ఉండవల్లి శ్రీదేవి కూడా రైతులకు అండగా ఉండాలి. లోకల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మా దగ్గరికి వచ్చి మాట్లడేంత వరకు  ఇక్కడే ఉంటాం అంటూ సెల్ టవర్ ఎక్కిన యువకుడు ఓ మీడియా ఛానల్ కు ఫోన్ కాల్ ద్వారా తెలిపారు. 

 

 

 దీంతో ఏలూరు  సెంటర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యువకులు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే నరసరావుపేట నియోజకవర్గం కి వెళ్లి అక్కడ మూడు రాజధాని వరకు మద్దతు కోరుతూ  స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన స్థానికులు... అందుకే నలుగురు యువకులు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. గత నెల రోజుల నుంచి నిరసనలు తెలుపుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... ఇప్పటి వరకు 12 మంది రైతులు అమరావతిలో ఆందోళనలతో చనిపోయారు... ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి అంటూ ప్రశ్నించారు యువకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: