తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ నెల 22 వ తేదీన మున్సిపల్, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి.  స్థానిక సంస్థల విషయాన్ని కెసిఆర్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు అప్పగించారు.  కొన్ని కొన్ని మున్సిపాలిటీలను కొంతమంది మంత్రులకు అప్పగించిన సంగతి తెలిసిందే.  పీర్జాదిగూడ, బోడుప్పల్, ఘట్ కేసర్, మేడ్చల్ మున్సిపాలిటీలను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి అప్పగించారు.  


మల్లారెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు అంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది.  మెంటార్ గా మల్లారెడ్డికి మంచి పేరు ఉన్నది.  అయితే, ఇప్పుడు మల్లారెడ్డికి  ఈ నాలుగు మున్సిపాలిటీల ఎన్నికల బాధ్యతలు అప్పగించారు.  నాలుగు మున్సిపాలిటీల్లో ఎలాగైనా విజయం సాధిస్తామని మల్లారెడ్డి అంటున్నారు.  ఎన్నికల ప్రచారం జరిగే సమయంలో కార్యకర్తలు తప్పించి ప్రజలు హాజరుకాకపోవడంతో నేతలు షాక్ అవుతున్నారు.  


ఎలాగైనా గెలుస్తామని చెప్తున్నా, గెలుపు సాధ్యం అవుతుందా అనే అనుమానం కలుగుతున్నది.  గెలుపు నల్లేరుపై నడక అని అంటున్నారు.  ఎన్నికల ప్రచారంతో పెద్దగా సంబంధం లేదని, కెసిఆర్  పథకాలే గెలిపిస్తాయని అంటున్నారు.  కానీ, గెలుపు ఎలా వస్తుంది అన్నది మాత్రం తెలియడం లేదు.  అభివృద్ధి పేదల పథకాలే గెలిపిస్తాయని అంటున్నారు.  నాలుగు మున్సిపాలిటీల్లో అత్యధిక మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధిస్తారని అంటున్నారు.  


అయితే, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఏరియాల్లో కొంతవరకు బలంగానే ఉన్నది.  ప్రచారం కూడా భారీ ఎత్తున చేస్తున్నారు.  ఈ ప్రచారంలో భాగంగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చూస్తున్నారు.  రేవంత్ రెడ్డి ఆ నియోజక వర్గాల్లో మంచి పట్టు ఉన్నది.  ఇప్పుడు రేవంత్ వర్సెస్ మల్లారెడ్డి అనే విధంగా మారిపోయింది.  మరి ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే మరో కొన్ని రోజులు ఆగాల్సిందే. జనవరి 22 న ఎన్నికలు జరిగితే, జనవరి 25 వ తేదీన రిజల్ట్ ప్రకటిస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: