అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా 
ఓ అమ్మకు కొడుకే..

 

అనే పాట గుర్తుంది కదా.. అవును ఆ దేవుడు తనకు బదులుగా అమ్మను సృష్టించారని అంటారు.  తొమ్మిది నెలలు కడుపులో దాచుకొని జన్మనిచ్చి మనం చనిపోయే వరకు నా బిడ్డ అంటూ మనకోసమే జీవించే గొప్ప గుణం ఉన్న అమ్మ మనకోసం ఏదైనా చేస్తుంది.  మనకు దెబ్బ తగిలితే తాను విల విలలాడుతుంది.. మనకు కష్టమొస్తే తాను కన్నీరు పెట్టుకుంటుంది.  అయితే అమ్మ మనకు ఏదైనా ఆపద వస్తే అపర భద్రకాలిగా మారి తన పిల్లల్ని రక్షించుకుంటుంది. ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు అనేది ఒక సందర్భంలో కేజీఫ్ హీరో యష్ చెప్పే డైలాగ్. ఇప్పుడు ఆ డైలాగ్ ని నిజం చేసి చూపించింది.  

 

తన బిడ్డలకు అపాయం ఎదురవుతోందంటే చాలు.. అమ్మ మనసు అస్సలూరుకోదు. ఎంతటి ప్రమాదానికైనా ఎదురెళ్తుంది. తాజాగా తమిళనాడులో జల్లికట్టు జరుగుతున్న జల్లికట్టు ఉత్సవాల్లో అలాంటి ఘటనే జరిగింది. రంకెలేస్తూ దూసుకొచ్చిన ఎద్దు నుంచి కాపాడుకునేందుకు బిడ్డను కడుపులో దాచుకుంది ఆ తల్లి.  తాజాగా దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శివగంగై జిల్లాలో జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో ఒక ఎద్దు తాళ్లు తెంచుకుని తల్లీబిడ్డల మీదకి దూసు కెళ్లింది. అయితే, ఆ తల్లి తన బిడ్డకు ఏ హానీ జరగకుండా కడుపులో దాచేసుకుంది. ఈ సమయంలో ఎద్దు ఆమెను తొక్కుకుంటూ దూకి వెళ్లిపోయింది.. ఆ సమయంలో తనకు గాయమైనా పట్టించుకోలేదు. ఈ  ఘటన చూసిన వారంతా తల్లి ప్రేమను చూసి ఆనందం వ్యక్తం చేశారు.  తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: