తెలంగాణ‌లో ఈ నెల 22న జ‌రిగే మునిసిపల్ ఎన్నిక‌ల్లో కారు పార్టీకి వార్ వ‌న్‌సైడ్ అవుతోంద‌న్న రాజ‌కీయ అంచ‌నాలు ఇప్ప‌టికే వెలువ‌డుతున్నాయి. గ‌తేడాది ఏప్రిల్‌లో జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కారు పార్టీకి క‌మ‌లం పెద్ద షాకే ఇచ్చింది. అప్ప‌టికే జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించి తిరుగులేని ఊపుమీదున్న కారు పార్టీ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కారు - 16 - ఢిల్లీలో టీఆర్ఎస్ స‌ర్కార్ అన్న నినాదంతో ఆ ఎన్నిక‌ల‌కు వెళ్లి బొక్క బోర్లా ప‌డింది.

 

ఇక లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో దెబ్బ‌తిన్న టీఆర్ఎస్ హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించి స‌త్తా చాటింది. ఇక ఇప్పుడు జ‌రుగుతోన్న మునిసిప‌ల్ ఎన్నిక‌లు ప‌లువురు టీఆర్ఎస్ కీల‌క నేత‌ల‌కు కీల‌కంగా మారాయి. ఈ క్ర‌మంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు.. పార్టీ త‌ర‌పున భ‌విష్య‌త్తులో కీల‌క నేత‌గా ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కెరీర్‌కు సైతం కీల‌క‌మ‌య్యాయి. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు విద్యార్థి సంఘం నేత‌గా ఉన్న సుమ‌న్ ఆ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా పెద్ద‌ప‌ల్లి ఎంపీగా పోటీ చేసి రాజ‌కీయ దిగ్గ‌జం వివేక్‌ను ఓడించారు.

 

ఇక ఎంపీగా ఉండ‌గానే కేసీఆర్ సుమ‌న్‌కు చెన్నూరు ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌గా ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇక తాజాగా జ‌రుగుతోన్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో సుమ‌న్‌కు రెండు ప‌రీక్ష‌లు ఎదురుకానున్నాయి. ఆయ‌న చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న రెండు మునిసిపాల్టీల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. నియోజ‌కవ‌ర్గ కేంద్ర‌మైన చెన్నూరుతో పాటు కేత‌న్‌ప‌ల్లి మునిసిపాల్టీల‌కు జ‌రిగే ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి వార్ వ‌న్‌సైడ్ అవుతుంద‌న్న అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.

 

ఈ రెండు చోట్ల టీఆర్ఎస్ గెలుపుపై ఎలాంటి సందేహాలు లేక‌పోవ‌డంతో టీఆర్ఎస్‌లోనూ, కేటీఆర్ టీంలోనూ సుమ‌న్ ప్ర‌యార్టీ మ‌రింత పెర‌గ‌నుంది. పార్టీ ప‌రంగాను.. సామాజిక స‌మీక‌ర‌ణ ప‌రంగాను భ‌విష్య‌త్తులో సుమ‌న్ మ‌రింత కీల‌కం కానున్నారు. కేసీఆర్ రేప‌టి రోజు సీఎం అయితే సుమ‌న్ కేటీఆర్ కేబినెట్‌లో మంత్రి అయినా.. మ‌రింత కీలకం అయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఏదేమైనా ఈ ఎన్నిక‌లు సుమ‌న్‌కు న‌ల్లేరు మీద న‌డ‌క‌మాదిరిగా మారిపోనున్నాయ్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: