ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలతో పాటు మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీని ఉద్దేశించి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికన్ల పైనా, వారి ఆస్తులపై దాడులు జరిగితే ప్రతిదాడులు తీవ్రంగా ఉంటాయన్నారు. ఉగ్రవాదాన్ని వీడి ఇరాన్ ను గొప్పదేశంగా మార్చే విషయంపై దృష్టి పెట్టమంటూ హితవు పలికారు. 

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఇరాన్‌పై స్వరం పెంచారు.ఇరాన్‌ అత్యున్నత  నాయకుడు అయతొల్లా ఖమైనీ లక్ష్యంగా ..'మాటలు జాగ్రత్త' అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌ 'సుప్రీం నేత'గా పిలవబడుతున్న వ్యక్తి అమెరికా, ఐరోపా పట్ల కాస్త కఠినంగా మాట్లాడుతున్నారు. వారి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ప్రజలు అనేక బాధలు అనుభవిస్తున్నారు. ఆయన కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి.. అని ట్విట్టర్‌ ద్వారా ఖమైనీని హెచ్చరించారు. అలాగే ''ఉగ్రవాదాన్ని వీడి, ఇరాన్‌ను తిరిగి గొప్ప దేశంగా మార్చాలంటూ ఆ దేశ నేతలకు హితవు పలికారు. అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మెరుగైన ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించారు.

 

మరోవైపు నిన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ.. తన ట్విట్టర్ ద్వారా అమెరికాపై విరుచుకుపడ్డారు. ఇరాన్ ప్రజలకు అండగా ఉంటున్నామంటూ  అమెరికా అబద్దాలాడుతోందని మండిపడ్డారు..ఒకవేళ మీరు ఇరాన్ ప్రజలతో కలిసి ఉన్నా.. అది వారి గుండెల్లో విషపు కత్తులతోపొడిచి చంపడానికే అన్నారు.  ఇప్పటికే ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. ఇక ముందు కూడా ఓటమిపాలవుతూనే ఉంటారన్నారు. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ అణుఒప్పందాలపైనా ఖమైనీ విరుచుకు పడినట్లు సమాచారం. మీరు దశాబ్దాల నుంచి మాపై ఆంక్షలు విధిస్తున్నా.. వాటిని తట్టుకునే నిలబడ్డామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ తెలిపారు. 

 

ఇరాన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతల నడుమ.. ఇరాన్ తో డీల్ కొనసాగించేందుకు యూరోపియన్ దేశాలు మొగ్గుచూపుతున్నాయి. ఈ ఒప్పందం  ఫలితంగగా ఇరాన్ కు ఆర్థిక ఊరట లభించడంతో పాటు ఈయు దేశాల చమురు కష్టాలు తీరనున్నాయి. ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు హసన్ .. యూరోపియన్ దేశాలతో చర్చించేందుకు.. మరికొద్దిరోజులు సమయం కావాలని సుప్రీంలీడర్ ఖమైనీని కోరుతూ వస్తున్నారు. అయితే మరోవైపు వాషింగ్టన్.. ఇరాన్ అణుసామర్థ్యాన్ని కట్టడి చేసేందుకు యత్నిస్తుండడం సమస్యగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: