ఇప్పుడు బీజేపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మంటలు పుట్టిస్తున్నాయి. ఆయనకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తూ, ఎప్పటి నుంచో సీనియర్ నాయకులుగా ఉన్న తమను పక్కనపెట్టేశారని ఆగ్రహంగా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా దగ్గుపాటి పురందరేశ్వరి ముందు వరసలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీని కాదని మరీ  ఒంటరిగా బరిలోకి దిగామని, ఇప్పుడు ఆ పార్టీ వ్యక్తిగా ముద్ర వేయించుకున్నపవన్ తో మనం పొత్తు పెట్టుకోవడం, బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శించిన టీడీపీ కీలక నాయకులను పార్టీలో చేర్చుకుని తప్పు చేశామని, ఇప్పుడు పవన్ ను చేర్చుకుని మరింత పెద్ద తప్పు చేశామన్నట్టుగా కొత్త రాగం అందుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 అసలు జనసేన పార్టీకి స్పష్టమైన ఒక విధానం ఏదీ లేదని, 2014 ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి వచ్చింది కేవలం 11 లక్షల ఓట్లు మాత్రమేనని, రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కు ఆపీసు కానీ, క్యాడర్ కానీ లేదని, అసలు ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణం ఏదీ లేదని అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మన నెత్తిన ఎక్కించుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ వారు అధిష్టానం పెద్దలను ప్రశ్నిస్తున్నారు. పవన్ రాక వలన ఏపీలో పార్టీ ఉనికే ప్రశ్నర్ధకం అవుతుందంటూ ఆందోళన చెందుతున్నారు. బీజేపీ సిద్ధాంతాలకు, జనసేన సిద్ధాంతాలకు చాలా వ్యత్యాసం ఉందని, ఈ పొత్తు వల్ల బీజేపీ దెబ్బతింటుందని వారు అధిష్టానం పెద్దలకు సూచిస్తున్నారట.

 

 పవన్ కల్యాణ్ ను ఇప్పుడు తీసుకుని ఏం చేస్తారని నిలదీస్తున్నారు. ముఖ్యంగా పురంధేశ్వరి వంటి సీనియర్ నాయకురాలు అయితే.. పవన్ రాకతో ఒరిగేది లేకపోతే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని కుండబద్దలు కొట్టినట్లు అధిష్టానం పెద్దల దగ్గర మాట్లాడారట. పురందరేశ్వరి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాన్నే చాలామంది ఏపీ బీజేపీ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారట. అయితే దీనిపై ఏపీ నేతలకు అధిష్టానం పెద్దలు సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. పవన్ కు ఏపీలో బలం లేకపోయినా ఒక సామజిక వర్గం మద్దతు ఉందని, దానిని బీజేపీ వైపుకి డైవర్ట్ అయ్యేలా మీరంతా కృషి చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: