జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ చేగువేరా భావజాలంతో రాజకీయాల చేస్తానని ఆయన జీవితం తన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిందని చాలా సందర్భాలలో రాజకీయ వేదికలపై మరియు సినిమా వేదికలపై బీభత్సమైన ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ అదే రేంజ్ లో చేగువేరా టైపులో గడ్డం పెంచుకొని ఆంధ్ర రాజకీయాల్లో రాణించాలని భావించిన పవన్ 2014 ఎన్నికల్లో చంద్రబాబు కి మద్దతు తెలిపి 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. అయితే ఓడిపోయి ఏడు నెలలు పూర్తి కాకముందే చేగువేరా భావజాలానికి విరుద్ధంగా ఉండే జాతీయ పార్టీ బీజేపీతో చేతులు కలిపి మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడానికి రెడీ కాబోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గుబురు గడ్డం ని కూడా తీసేయడానికి రెడీ అయి త్వరలో క్లీన్ షేవ్ తో దర్శనం ఇవ్వనున్నట్లు సమాచారం.

 

మేటర్ లోకి వెళితే పవన్ కళ్యాణ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా 'పింక్' సినిమాని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెలుగులో చేయబోతున్నట్లు ఇప్పటికే అనేక వార్తలు రావడం జరిగింది. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ దాదాపు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు కేవలం 20 రోజులు మాత్రమే షూటింగ్ కి హాజరు కాబోతున్నట్లు రాబోయే సమ్మర్ కి సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. దీంతో పవన్ కళ్యాణ్ త్వరలో గడ్డం తీస్తారు అని వార్తలు వస్తున్న తరుణంలో రాజకీయంగా పవన్ కళ్యాణ్ నీ విభేదించే వాళ్ళు పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు.

 

బీజేపీతో ఎప్పుడు చేతులు కలపటం జరిగిందో అప్పుడే గడ్డం తో పాటు అన్ని తీసేసాడు చచ్చినా బతికినా బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పార్టీని నడిపే దమ్ము, ధైర్యం సత్తా లేక విశ్వసనీయత విలువలు లేకుండా వ్యవహరిస్తున్నాడు అంటూ మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కట్టె కాలే వరకు సినిమాలు చేసే ప్రసక్తే లేదు అని.., నా జీవితం మొత్తం ప్రజా సమస్యలపై పోరాటానికి అన్న పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు స్టార్ట్ చేయడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: