ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి త‌ర‌లింపు, మూడు రాజ‌ధానుల అంశం విష‌యంలో ప్ర‌ధానంగా టార్గెట్ అయింది కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు. ముఖ్యంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. అయితే, తాజాగా త‌మ గ‌లం వినిపించారు. అభివృధి వికేంద్రీకరణలో భాగంగా నరసరావుపేటలో స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌లో ఎమ్మెల్యేలు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

 

ఎమ్మెల్యే reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉందని ఎద్దేవా చేశారు. పార్టీని కాపాడుకోవడానికి  చంద్రబాబు అమరావతి ఉద్యమం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. వాస్తు కోసం. తమ రాజకీయ ఉన్నతి కొరకు మూడు పంటలు  పండే భూమిని తీసుకోవటం న్యాయమా? అని సూటిగా ప్ర‌శ్నించారు. బినామీల కొరకు ఆరాట పడుతున్న వ్యక్తి చంద్రబాబు అయితే...ప్రాంతాల అభివృద్ధి కొరకు పోరాడుతున్న వ్యక్తి జగన్ అని స్ప‌ష్టం చేశారు. 

 

మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ ప్ర‌సంగిస్తూ రాజధాని ముసుగులో వ్యాపారం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. వ్యాపారం ముసుగులో రైతులకు మోసం చేసిన వ్యక్తి, దళిత సోదరుల భూములను లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని మండిప‌డ్డారు.  దళిత సోదరులకు ఒక్క జీఓతో వారి భూములను తిరిగి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వెల్ల‌డించారు. 
అమరావతిని అభివృద్ధి చేస్తే తాడికొండ నియోజకవర్గంలో ఎందుకు ఉడిపోయావు చంద్రబాబు అని ఆర్కే సూటిగా ప్ర‌శ్నించారు. రాజధాని ముసుగులో వేల కోట్లు దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిప‌డ్డారు. రాజధానికి శాపం చంద్రబాబు అని దుయ్య‌బ‌ట్టారు. రాజధానిలో రైతులకు ఇచ్చిన ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తానన్న జగన్ ,రాజధానికి వరం అని స్ప‌ష్టం చేశారు.

 

ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ గ్రాఫిక్స్‌లో చూపించిన దానిలో అభివృద్ధిలో 25 శాతం జరిగిన ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గతంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ చెప్పినట్లు గానే  అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.  వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రాహ్మ‌నాయుడు ప్ర‌సంగిస్తూ  గత ప్రభుత్వంలో పల్నాడు ప్రాంతంలో జరిగిన దోపిడీకి ఎప్పుడు నోరెత్తని చంద్రబాబు, ఈరోజు అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుందని ఉద్యమం చేయటం విడ్డురంగా ఉందని వ్యాఖ్యానించారు. పల్నాడు ప్రాంతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి పధములో నడుస్తుంటే  చంద్రబాబు రెచ్చ‌గొట్టే రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. 

 

చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఆర్భాటాలు త‌ప్ప ఏం చేశారని మ‌రో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిప‌డ్డారు. ``ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాద్దాంతం చేస్తున్నాడు. అమరావతి అని భ్ర‌మారవతిని చేశారు. చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌లో దళితులకు చెందిన‌ సుమారు రెండు వేల ఎకరాలు భూమిని కొట్టేశారు. దండుపాళ్యం ముఠాలాగా దోచుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అమరావతి రైతులు ఇంకా చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్ముతున్నారు?చంద్రబాబు నాయుడు తన బంగారు గని చేజారిపోతుందని ఈ ఉద్యమాలకు పాల్పడుతున్నడు. చంద్రబాబు నాయుడు పాపాలు, అమరావతికి శాపాలు. చంద్రబాబును నమ్మకండి, తమ జీవితాలు నాశనం చేసుకోకండి.`` అని ఉద్యమం చేస్తున్న వారికి సూచించారు. 

 

వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ మూడు రాజధానులు వద్దు అనే వారు ప్రజలు కాదని అన్నారు. అమరావతిలో భూములు కొన్న వ్యక్తులు మాత్రమే తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని వలన లాభ పడ్డ వ్యక్తులు  చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మాత్రమేని అంబ‌టి ఆరోపించారు. నిజమైన రైతులకు ఎటువంటి నష్టం లేదని, కేవ‌లం బినామీల‌కే నష్టమ‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: