ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవడం సహజం. ప్రభుత్వంలో ఎక్కడ లొసుగు దొరుకుతుందా? ఎప్పుడు విమర్శిద్దామా? అని చూస్తుంటారు. ప్రభుత్వం ఎంత మంచిగా పాలన చేసిన ఏదొక విధంగా విమర్శలు చేస్తూనే ఉంటారు. సరిగా ఇదే పరిస్తితి ఇప్పుడు ఏపీలో కూడా నడుస్తుంది. జగన్...అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల బాగోగుల కోసం కష్టపడుతుంటే...ఆయన్ని ఏదోకవిధంగా విమర్శించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి.

 

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి...ప్రభుత్వంపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు. కనీసం కొత్త ప్రభుత్వానికి ఏడాది కూడా సమయం ఇవ్వకుండా రోడ్లపైకి వచ్చి రచ్చ చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు అనసవరపు విమర్శలు చేస్తుంటే, వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. సీఎంగా ఉన్న జగన్ వీటిని పట్టించుకునే సమయం కూడా ఉండదు కాబట్టి., ప్రతిపక్షాలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత మంత్రులదే.  

 

అయితే జగన్ మంత్రి వర్గంలో ఎక్కువ కొత్తమందే ఉన్నారు. సీనియర్లు నలుగురైదుగురే ఉన్నారు. దాని వల్ల ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రతిపక్షాలకు విమర్శలకు చెక్ పెట్టడంలో మంత్రులు చాలా వరకు ఫెయిల్ అయ్యారనే ప్రచారం వచ్చింది. ఏదో ఇద్దరు ముగ్గురు తప్ప, మిగతా వారు పెద్ద ఎఫెక్టివ్‌గా మాట్లాడటం లేదని చర్చ నడిచింది. ఇక ఇదే విషయంపై పలు కేబినెట్ సమావేశాల్లో మంత్రులకు జగన్ క్లాస్ తీసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఇలా కొత్తలో ఇబ్బందులు పడ్డ మంత్రులు రాను రాను రాటుదేలిపోయారు.

 

కేబినెట్‌లో ఉన్న మెజారిటీ మంత్రులు తమ మాటలకు పదును పెట్టారు. ప్రతిపక్షాలు చేసే ప్రతి విమర్శకు కౌంటర్ ఇవ్వడంలో ఆరితేరిపోయారు. ముఖ్యంగా కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, సురేశ్ బాబు, నారాయణ స్వామి, అవంతి శ్రీనివాస్‌లు తమదైన శైలిలో ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పారు. ఇటు సీనియర్లు ఎలాగో ఏ మాత్రం తగ్గకుండా ముందుకెళుతున్నారు. ఇక రాజధాని విషయంలో మాత్రం అందరు మంత్రులు ప్రతిపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఈ విధంగా మంత్రులు ప్రతిపక్షాలు పనిపట్టడం వల్ల జగన్‌కు పాలన చాలా సులువైంది. ఏ అడ్డు లేకుండా సజావుగా ప్రభుత్వాన్ని నడిపించగలుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: