యువ‌త‌కు ఉద్యోగ క‌ల్ప‌న విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క ఆవిష్క‌ర‌ణ‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్ర‌ధానంగా ఎక్కువ ఉద్యోగాలు క‌ల్పించే ప్రైవేటు రంగం విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ద‌ళారులు, ఫేక్‍ కంపెనీల చేతిలో నిరుద్యోగులు మోసపోకుండా డిజిటల్‍ ప్లాట్‍ఫామ్స్ పై ఉద్యోగాలు పొందేలా డిజిటల్ ఎంప్లాయ్​మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) యాప్‍ రూపొందించింది. టెక్నాలజీ యుగంలో మొబైల్‍ వేదికగా రిక్రూట్‍మెంట్‍ను అందించేందుకు ఈ సేవ‌ల‌ను ప్రారంభించారు. ఈ సర్వీస్‍ ఉచితంగా అందజేస్తున్నారు. డీఈఈటీ యాప్‌తో పాటుగా వెబ్‌సైట్ సైతం అందుబాటులో ఉంది. 

ప్రైవేట్ రంగంలో ఉన్న అవ‌కాశాల‌ను యువ‌త కైవ‌సం చేసుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్‍ ప్లే స్టోర్‍ నుంచి టీఎస్‍డీట్‍ యాప్‍ డౌన్‍లోడ్‍ చేసుకోవాలి. ఏ త‌ర‌హా ఉద్యోగం ఆశిస్తున్నారో ఆ  వివరాలు ఎంటర్​ చేయాలి. రెజ్యుమె, ఎడ్యుకేషన్‍ సర్టిఫికెట్లను అప్‍లోడ్‍ చేయాలి. సంబంధిత‌ జాబ్స్ నోటిఫికేషన్‍ వచ్చినప్పుడు మెయిల్‍కు మెసేజ్​ వస్తుంది. నిరుద్యోగులు, కంపెనీల ప్రొఫైల్స్ ను ఫిల్టర్‍ చేసేందుకు అప్లికెంట్‍ ట్రాకింగ్‍ సిస్టం(ఏటీఎస్‍), మెషిన్‍ లెర్నిం గ్‍(ఎంఎల్‍), ఆర్టిఫిషియల్‍ ఇంటెలి జెన్స్(ఏఐ) వంటి యూజర్‍ ఫ్రెండ్లీ టెక్నాలజీ ఉంది.

 

ఎంప్లాయ్ మెంట్‍ అండ్‍ ట్రైనింగ్‍ శాఖ, స్టోరీ టెక్‍ అనే ప్రైవేట్‍ ఐటీ సంస్థలు డీఈఈటీ యాప్ మ‌రియు వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాయి. జీఎంఆర్‍, అపోలో హాస్పిటల్స్, ఆసియాన్‍ పెయింట్స్, స్విగ్గీ వంటి కంపెనీలతో పాటు మరెన్నో ఎంఎన్‍సీ, ఐటీ కంపెనీల్లో జాబ్ ఆఫర్స్​ ఈ సైట్‌లో పొందుప‌ర్చ‌బ‌డ‌బి ఉన్నాయి. వివిధ రంగాల్లో దాదాపు 45 వేల వరకు జాజ్​ ఆఫర్స్​ ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‍ పారదర్శకంగా చేపడుతున్నామ‌ని, అర్హుల‌కు సరైన అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని నిర్వాహ‌కులు పేర్కొన్నారు. ఇంకేం, ఆస‌క్తి ఉంటే, యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మీ అర్హ‌త‌కు త‌గిన ఉద్యోగ అవ‌కాశాల‌ను సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: