ఎన్నికలు వచ్చాయి అంటే ప్రచార హోరు మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే. ఎవరికివారు ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రచారంలో దూసుకుపోతూ ఉంటారు. ఇక ఎన్నో హామీలు ఇస్తూ ఓటర్ మహాశయులకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓటర్లను ఎంతగా ఆకట్టుకుంటే ఎన్నికల్లో అన్ని ఓట్లను సాధించవచ్చు అని అభ్యర్థుల నమ్మకం. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎంతోమంది భిన్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తాము చేసిన భిన్నమైన ప్రయత్నాలు ఓటరును ఆకర్షిస్తే కొన్ని కొన్ని సార్లు... అంతగా వర్కవుట్ అవ్వదు .ఇకపోతే  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. 

 

 

 దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి . తమదే ఈసారి విజయమని అందరు నేతలు ధీమాగా ఉన్నారు. ప్రచార వ్యూహం తో ప్రత్యేక ప్రణాళికలతో దూసుకుపోతున్నాయి అన్ని పార్టీలు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక వ్యూహాలతో ఎన్నికల రంగంలో బిజీ బిజీగా ఉన్నాను. రెండోసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కేజ్రీవాల్ భార్య సునీత అతని కుమార్తె హర్షిత ఢిల్లీ పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓట్ల కోసం ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ ఇద్దరు చెమటోడ్చారు . 

 

 

 తన తండ్రి కేజ్రివాల్ కు  ఓటు వేసి మరోసారి గెలిపించాలని హర్షిత ఓటర్లను కోరారు . అయితే భార్యాబిడ్డలు కలిసి కేజ్రీవాల్ తరఫున ప్రచారం చేయడం ఎన్నికల్లో ఎంత కలిసి వస్తుంది అనేది మాత్రం ఫలితాల అనంతరం తెలనుంది . దేశ రాజధానిలో ఎన్నికలు జరుగుతుండడంతో ప్రధాన పార్టీలైన ఆప్, బిజెపి కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా హస్తి నాలో అధికారానికి దూరంగా ఉన్న కమలనాథులు విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక గత వైభవం కోసం హస్తం పార్టీ నేతలు కూడా తీవ్రంగానే కసరత్తులు చేస్తున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక  ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: