ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాల్లో  ఒక్కసారిగా వేడెక్కిన  విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 3 రాజధానిల  ప్రకటన చేసినప్పటి నుంచి ప్రతిపక్ష టిడిపి పార్టీ నేతలందరూ జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాక మూడు రాజధానులు అంశాన్ని తెరమీదకు తెచ్చి అధికార పార్టీ పబ్బం  గడుపుతుంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చట్టసభల రాజధాని... కర్నూలులో హైకోర్టు.. అమరావతి లో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 

 

 

 అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అటు అమరావతిలోని రైతులు కూడా నిరసన బాట పట్టారు. ఇప్పటికే గత నెల రోజుల నుండి అమరావతి రైతులందరూ రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రాజధాని రైతులు. దీంతో అమరావతి మొత్తం అట్టుడికిపోతోంది. ఇక అటు బిజెపి జనసేన పార్టీ లు కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిలోనే  పర్యటిస్తూ అమరావతి రైతుల నిరసన లకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

 

 

 ఇకపోతే తాజాగా సీఎం  జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయంపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  అసెంబ్లీ సచివాలయం ఒకేచోట ఉంటేనే అది రాజధాని అవుతుందని వ్యాఖ్యానించిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి..  జగన్ మూర్ఖత్వమే అతడిని మోసం చేస్తుంది అంటూ  విమర్శించారు.  ఒకవేళ అమరావతి రాజధాని చేయకపోతే కడపను రాయలసీమకు రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆరోపించిన జెసి దివాకర్ రెడ్డి... జగన్ ప్రవర్తన మార్చుకోకపోతే ఈ నెల 23న రాయలసీమ నేతలు అందరూ కలిసి కార్యాచరణ ప్రకటిస్తాం అంటూ హెచ్చరించారు

మరింత సమాచారం తెలుసుకోండి: