రాజకీయంగా తనను తాను నిరూపించుకునేందుకు చంద్రబాబు తనయుడు లోకేష్ తీవ్రంగానే కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. తన తండ్రి చంద్రబాబుకు వయసు మీద పడటం ,తన నాయకత్వంపై పార్టీ కేడర్లో ఇంకా అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో  లోకేష్ బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టాల్సి ఉండడంతో స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి. అమరావతి  విషయంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ గుర్తింపు తెచ్చకోవాలని చుస్తునందు. అందుకే రైతులు, ప్రజల తరఫున పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ సవాల్ చేస్తున్నాడు. 


 తాజాగా నిన్న అమరావతి కోసం ఉండవల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు, కృష్ణా జిల్లా వైసిపి ఎమ్మెల్యేలకు లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. మీరంతా వెంటనే అమరావతి కోసం మీ పదవులకు రాజీనామా చేసి పోరాటంలోకి రావాలని నేను హెచ్చరిస్తున్నాను అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. మీరంతా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీవ్రంగా పెంచాలని, మీరు రాజీనామా చేయకుండా ఇంకా డ్రామాలు ఆడాలనుకుంటే మీరు రెండు జిల్లాల్లో తిరిగే పరిస్థితి ఉండదు అంటూ హెచ్చరించారు.


 ప్రభుత్వానికి ఒక మాట చెబుతున్నాను... ప్రపంచంలో ఒకే ఒక దేశంలో మూడు రాజధానులు ఉన్నాయి కానీ, 194 దేశాలు ఒకే ఒక రాజధానితో ముందుకు వెళ్తున్నాయి అంటూ లోకేష్ చెప్పారు. రాజధాని అనేది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, అది గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించారు. మీరు ఎన్ని బలగాలు దించినా రైతుల కోసం పోరాడే విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదంటూ చెప్పారు. మూడు ముక్కలుగా రాజధానిని ఏర్పాటు చేయడం సరైంది కాదని సూచించారు. అమరావతి కోసం తాను మంగళగిరి వారసుడిగా, ఆంధ్రుడిగా నేను అన్నివిధాలా అండగా  నిలబడతానని లోకేష్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: