రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించబోతున్నారన్నది జగమెరిగిన సత్యం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. న్యాయ పరమైన ఇబ్బందులు కూడా లేకుండా వైసీపీ సర్కారు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే జనం కూడా మెంటల్ గా ప్రిపేరయ్యారు. అయితే ఈ సమయంలో ఓ వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అసలు రాజధాని ఎక్కడికి తరలిపోవడం లేదని చెబుతున్నారు. ఆయన ఎవరో కాదు.. రాజధాని ప్రాంతానికి చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణ. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి మోపిదేవి తెలిపారు. నరసరావుపేట సభలో మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని పేర్కొన్నారు. ప్రాంతీయ అసమానతల వల్లే ఉద్యమాలు వస్తున్నాయని గత నివేదికలు తేల్చాయని స్పష్టం చేశారు.

 

బాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆయనకు లేకపోవడం సిగ్గుచేటని మంత్రి మోపిదేవి అన్నారు. అమరావతికి ఏదో జరిగిపోతుందంటూ చంద్రబాబు అసమానతలు ఏర్పరిచి కులాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడుతున్నారని మోపిదేవి మండిపడ్డారు. అయితే ఓవైపు రాజధాని తరలింపు ఏర్పాట్లు జోరుగా చేస్తూ రాజధాని ఎక్కడకూ పోవడం లేదని మంత్రి వ్యాఖ్యానించడం ఏంటి అన్న వాదన వినిపిస్తోంది.

 

ఒక్క మోపిదేవి మాత్రమే కాదు.. ఇటీవల మరికొందరు వైసీపీ నేతలు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు. ఇందులో అసలు లాజిక్ ఏంటంటే..అమరావతిని లెజిస్లేచర్ క్యాపిటల్ గా కొనసాగిస్తున్నందువల్ల ఇది కూడా ఓ రకమైన రాజధాని అవుతుందని.. ఇప్పడు కేవలం రాజధానిని మూడు నగరాలకు విభజించామని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. టెక్నికల్ గా చూస్తే ఆ వాదనా నిజమే. అదీ సంగతి. అంటే ఓవైపు రాజధానిని అంటే.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను చేస్తూనే.. మరోవైపు అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా ఉంచుతూ టెక్నికల్ గా ఇబ్బంది రాకుండా చేస్తున్నారన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: