మొత్తానికి అనుకున్నట్లే పవన్ మోడీ చెంతకు చేరారు. తాను పార్టీ పెట్టిన మొదట్లో పార్టీకైతే తన మద్దతుని తెలిపాడో చివరికి అదే పార్టీ తో కూటమి ఏర్పాటు చేశాడు. బీజేపీ, జనసేన మధ్య పొత్తు అధికారికంగా ఖరారైంది. విజయవాడలో గురువారం నిర్వహించిన సంయుక్త భేటీలో ఇరు పార్టీల నేతలు విషయాన్ని వెల్లడించారు.

 

ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందన్న పవన్.. ఏపీ భవిష్యత్తు కోసం పార్టీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. ఏపీలో జగన్ సర్కారు చేసే తప్పిదాలపై ఇక నుంచి ఇరు పార్టీలు ఉమ్మడిగా పోరాడతాయి. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

 

దీంతో  పలువురు సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇందులో భాగంగా కొంతమంది మొదట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ పై తీవ్ర విమర్శలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారితోనే పొత్తు పెట్టుకున్నాడని అంటున్నారు.

 

మరికొందరైతే రాష్ట్రంలో బీజేపీ పార్టీని ఎండగడతామని ఒకప్పుడు శబధం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇలా బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకోవడం వలన అతడికి తీవ్ర నష్టమని అంతేగాక దీనివల్ల ఇతర పార్టీలు లాభం చేకూరుతుంది తప్ప తనకు ఉపయోగం ఉండదని అంటున్నారు.

 

కానీ ఇక్కడ ఎవ్వరికీ అర్థం కాని విషయం ఏమిటంటే…. గత సంవత్సరం ఎన్నికల్లో పవన్ మరియు చంద్రాబు ఒకటేనంటూ జనాలను నమ్మించడంలో వైసీపీ విపరీతంగా సక్సెస్ అయింది. దానితో న్యూట్రల్ ఓట్ళు కూడా వారి ఖాతాలోకే మళ్ళాయి. ఇక తెదేపా ఓట్ళు మొత్తం జనసేనకు చీలగా జగన్ అలవోకగా విజయం సాధించాడు. ఇప్పుడు బీజేపి లాంటీ పెద్ద అండతో పవన్ గేమ్ సరిగ్గా ప్లే చేస్తే తాను కోల్పోయిన ఓట్లు మరియు తేదేపా ఓట్లు కూడా కలిసి దండుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: