ఎల్లోమీడియాగా చంద్రబాబు కరపత్రంగా మారిన ఓ తెలుగు పత్రిక ప్రతి ఆదివారం సమకాలీన రాజకీయాలపై ఓ సుదీర్ఘ విశ్లేషణాత్మక కథనం ప్రచురిస్తుంటుంది. దాన్ని ఆ పత్రిక యజమానే రాస్తుంటారు. అయితే కొంత కాలంగా ఆయన దీన్ని వైసీపీ అధినేత జగన్ పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన ఈ రాసిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పుల్లలు పెట్టేదిగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్, కేసీఆర్ సఖ్యతగా ఉంటున్నారు. తరచూ కలుస్తున్నారు. ఇలా అయితే ఎలా.. ఇండియా, పాక్ లా భగ్గుమనాల్సిన ఆంధ్రా, తెలంగాణ సీఎంలు ఇంత సఖ్యతగా ఉంటే ఎలా అన్నట్టుగా ఉంటున్నాయి ఆ ఎల్లో పత్రిక రాతలు. ఆయన తాజా రాతలు పరిశీలిస్తే ఇదే విషయం బయటపడుతుంది.

 

ఏంరాశారో చూడండి.. ”తెలంగాణలో అధికారంలో ఉన్నవారు ఆంధ్రాలో అధికారంలో ఉన్నవారిని తక్కువ చేసిమాట్లాడినా లేక ప్రజలను చులకన చేసి మాట్లాడినా అది ఆంధ్రప్రదేశ్‌కే అవమానం! అయినా రాజకీయ అవసరాల కోసమో లేక ఎన్నికల సమయంలో చేసిన సహాయానికి కృతజ్ఞతగానో జగన్మోహన్‌ రెడ్డి ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను ఆలింగనం చేసుకుని గంటల తరబడి మంతనాలు జరుపుతూనే ఉన్నారు.

 

సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాలను తిలకించడానికి వెళ్లిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ను అక్కడి వైసీపీ నాయకులు తులాభారంతో సత్కరించారు. రాష్ట్రం విడిపోయి ఆరేళ్లు కావొస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక్క మంత్రికి కూడా తెలంగాణ గడ్డమీద ఇలాంటి సత్కారం జరగలేదు. జరగదు కూడా! ఈ వ్యత్యాసంపై ఆలోచించాల్సిన వాళ్లు ఆ దిశగా ఆలోచించి ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకుని ఉండేవి కావు.”

 

రెండు రాష్ట్రాలు విడిపోయి ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఇలా రెండు రాష్ట్రాల నేతలను రెచ్చగొట్టే రాతలు ఎంత వరకూ సమంజసమో మరి ఆయనే తేల్చుకోవాలి. జగన్ పై బురద జల్లాలంటే మరీ ఇంతగా జనం మధ్య చిచ్చుపెట్టాలా అంటున్నారు పాఠకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: