ఎలక్షన్స్ వచ్చాయంటే ప్రతి నాయకుడు డైలాగ్ రైటర్ అయిపోతాడు. తన మార్క పంచ్ డైలాగులతో ప్రతి పక్షాల నాయకులపై మాటల తూటాలు పేల్చుతుంటాడు. ఇదిగో ఇప్పుడు తెలంగాణాలో జరిగే మున్సిపల్ ఎలక్షన్స్‌లో ఇదే జరుగుతుంది. అధికారపార్టీ నాయకులు ప్రచారంలో భాగంగా, తమ ప్రత్యర్ధుల పాలన లోపాలపై చేసే ప్రచారం ఆశ్చర్యమనిపిస్తుంది.

 

 

ఇక్కడ సామాన్య ప్రజలు అనుకునే విషయం ఏంటంటే అధికారంలోకి రావడానికి ఎన్నో మాట్లాడుతారు. పదవి ఉన్న వాడు, ఎప్పుడు పదవిలేని వాన్ని తిడితేనే ఓట్లు వస్తాయనే ఫార్ములాను ఆచరిస్తాడు. తన కంట్లో ఉన్న నలుసు కోసం ఎవరు మాట్లాడరు. పక్కవాడి కంట్లో నలుసును ఎత్తి చూపుతారు. ఎలక్షన్స్ వచ్చిన ప్రతి సారి ఓటర్ల చేవులు ఇలాంటి మాటలు విని విని  పట్టించుకోవడం మానేసాయి.

 

 

ఇకపోతే ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా చేసిన వాఖ్యలు ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్‌, ప్రతిపక్షాలు ప్రజల ముందుకు వస్తాయని.. వారికి ఓటేస్తే దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పితకడమేనని అన్నారు. చెప్పింది చేసేది, చేసేది చెప్పేది కేసీఆర్‌ సర్కారు మాత్రమేనని.. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

 

 

ఇదిలా ఉండగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తన వంతుగా ప్రచారంలో పాల్గొని పెద్దపల్లి, మంథని, రామగుండంలో ప్రచారం చేస్తూ అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించి సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కానుకగా ఇవ్వాలని  కోరారు. ఇక ఈ ప్రచారంలో పెద్దపల్లి జెడ్పీచైర్మన్‌ పుట్ట మధూకర్‌, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ పాల్గొన్నారు.

 

 

బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగర్‌లో విస్తృతంగా పర్యటిస్తూ పది డివిజన్లలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. జగిత్యాలలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ రామ్మోహన్‌లతో కలిసి ప్రచారం జోరుగా చేశారు.. ఇకపోత ఓట్లు ఎవరికి పడ్డ గెలిచిన వారు బాగుపడతారే గాని గెలిపించిన వారికి మిగిలేది చివరికి చిప్పే అని కొందరు ఓటర్లు తమ మనసులో అనుకుంటున్నారట...

మరింత సమాచారం తెలుసుకోండి: