భారతదేశంలోని ప్రతి పౌరునికి ఆధార్ కార్డు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే . ఆధార్ కార్డులో ఉన్న తప్పుల కారణంగా ఇప్పటికీ ఎంతోమంది బాధపడుతూనే ఉన్నారు.  ఆధార్ సెంటర్ ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చాలా మందికి ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల,.. సర్వర్ డౌన్  ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో ఆధార్ కార్డ్లో మార్పులు చేసుకోవడానికి వెళ్లిన వారు నిరాశతో వెనుతిరుగుతూ  ఉంటారు. అంతేకాకుండా ఆధార్ కార్డు చిరునామాలో తప్పులు ఉన్నప్పుడు దానిని సరి చేసుకోవడానికి కూడా ఎన్నో తంటాలు పడాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు చిరునామా తప్పు గా ఉండడం లేకపోతే ఒక అడ్రస్ నుంచి మరో అడ్రస్ కు  మారినప్పుడు ఆధార్ కార్డులో  చిరునామా ను మార్చాలి అనుకోవడం.. లాంటివి చేస్తూ వుంటారు చాలామంది. 

 

 

 అంతే కాకుండా కొత్తగా పెళ్లైన వాళ్ళు ఇంటి అడ్రస్ ను అమ్మ వారి ఇంటి దగ్గర నుంచి భర్త ఇంటి దగ్గరకు మార్చాలని అనుకోవడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇలా అడ్రస్ మార్చుకోవాలి అనుకోవడం మంచి విషయమే కానీ మార్చుకోవడమే కాస్త కష్టమైన పని కదా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆధార్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత అడ్రస్ మార్చడానికి ఆధార్ సెంటర్లు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుంటూ ఉండడం... అంతేకాకుండా ఆధార్ సెంటర్ లో ఎక్కువమంది ఇదే సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉండటం వల్ల..  ఆధార్ కార్డులు చిరునామా మార్చడం ఆలస్యం అవుతుండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. రెండు మూడు సార్లు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరిగితే కానీ ఆధార్ సెంటర్లు అడ్రస్ మార్చుకోవడానికి ఉండదు. 

 

 

 కానీ ఇప్పుడు మాత్రం ఆధార్ కార్డులో  అడ్రస్ మార్చుకోవటం  చాలా సులభతరం అయిపోయింది. ఆన్లైన్ లో ఆధార్ కార్డు అప్డేట్ చేయండి ఇలా. 

 ముందుగా యుఐడిఎఐ అధికారిక వెబ్సైట్ http://uidai.gov.in/ ఓపెన్ చేయండి. 

 అప్డేట్ ఆధార్ సెక్షన్ అప్డేట్ యువర్ అడ్రస్ ఆన్లైన్ లింక్ క్లిక్ చేయండి. 

 ఆ తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవగానే అందులో ప్రొసీడ్ టు అప్డేట్ అడ్రస్ అనే లింక్  పైన క్లిక్ చేయండి. 

 అనంతరం మీ ఆధార్ నెంబర్ క్యూ ఆర్  కోడ్ ని..క్యాప్చ  ఎంటర్ చేయండి. 

 మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేస్తే మీ అడ్రస్ అప్డేట్ అయిపోతుంది. కాగా దీనికి మీ అడ్రస్ ప్రూఫ్ జత చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: