ఎన్నోసార్లు టిఆర్ఎస్ నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోసారి ఇలాంటి ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. కోట్లు విలువ చేసే స్థలాన్ని ఆక్రమించి ఓ మంత్రి అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు అంటూ స్థానిక టిఆర్ఎస్ నేతలు స్థానికులు ఆందోళనకు దిగారు. ఐదు గ్రామాల చెరువుల నీళ్లు ప్రవహించే నాలా ను కబ్జా చేసి అక్రమంగా అపార్ట్మెంట్ నిర్మిస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్మాణాలను నిలిపివేయాలంటూ దూలపల్లి కొంపల్లి  గ్రామాల టీఆర్ఎస్ నేతలు ప్రజలు అధికారులను కోరారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంత్రి వ్యవహారాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు ప్రజలు. 

 

 

 నాలా కబ్జా అవుతున్న దానిని అడ్డుకోవడంలో కొంపల్లి మున్సిపల్ కమిషనర్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. కొంపల్లి దూలపల్లి గ్రామాల సరిహద్దులోని సర్వే నెంబర్ 99,  170 సి లలో 200 మీటర్ల విస్తీర్ణంలో నాలా  ప్రవహిస్తోంది. ఈ నాలా  ద్వారా దూలపల్లి కొంపల్లి మైసమ్మగూడ గుండ్లపోచంపల్లి గ్రామాల్లోని 5 చెరువుల నీరు ప్రవహించి... ఆ నీరు ఫాక్స్ సాగర్ లో కలిగిస్తూ ఉంటుంది. గత కొన్నేళ్ళుగా ఈ భూమి వివాదాస్పద స్థలం గానే ఉంది. కాగా ఈ నాలా ప్రవహిస్తున్న భూమిచుట్టూ మంత్రి అతడి అనుచరులతో రేకులతో ప్రహరీ ఏర్పాటు చేశారు. ఇక అక్కడ గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు చేపట్టడం మొదలుపెట్టారు. దీంతో ఇది గమనించిన దూలపల్లి కొంపల్లి టీఆర్ఎస్ నేతలు... అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో... మంత్రి అక్రమ కట్టడం నిరసిస్తూ సంఘటన స్థలంలో ఆందోళన చేపట్టారు. 

 

 

 అనంతరం స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ను కలిసి విషయాన్ని వివరించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న మైనంపల్లి హనుమంతరావు మేడ్చల్ కలెక్టర్ తో మాట్లాడారు. దుండిగల్ తహసిల్దార్ భూపాల్ సంఘటన స్థలానికి చేరుకొని నిర్మాణాలను పరిశీలించారు. అక్కడ  నిర్మాణ పనులు చేపట్టకుండా జెసిబి తో కాలువను తవ్వించారు. నాల అక్రమ ఆక్రమణలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించచేది  లేదంటూ ఎమ్మెల్యే మైనంపల్లి హెచ్చరించారు. ఎవరైనా చిన్న డబ్బా వేసుకుంటేనే ఆగమేఘాలపై వచ్చి వాటిని తొలగించే మున్సిపల్ కమిషనర్ ఈ నిర్మాణాన్ని మాత్రం ఎందుకు అడ్డుకోలేదు అంటూ నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: