వాహనదారులకు మంచి రోజులు వచ్చేశాయి. నేడు మళ్ళి పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళి భారీగా తగ్గాయి.. వరుసగా రెండు నెలల నుండి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజుల నుండి భారీగా తగ్గుతున్నాయి. రెండు నెలల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర మొన్నటి వరుకు 81 రూపాయల వద్ద ఉండేది. అలానే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు వారం నుండి తగ్గుముఖం పట్టాయి. 

 

దీంతో నేడు శుక్రవారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 18 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 18 పైసలు తగ్గింది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 18 పైసలు తగ్గుదలతో రూ. 79.85 కు చేరగా, డీజల్ ధర 18 పైసలు తగ్గుదలతో 74.63 రూపాయలకు చేరింది. ఇంకా విజయవాడలో, అమరావతిలో కూడా పెట్రోల్, డీజిలు ధరలు కూడా ఇలాగె కొనసాగుతున్నాయి.

 

దేశ రాజధాని అయిన ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యేత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. 

 

ఏది ఏమైనా.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా అయితే పెరిగాయో.. అలాగే తగ్గుతూ వస్తున్నాయి. వారం రోజులలో 1 రూపాయి తగ్గింది ఈ పెట్రోల్ ధర. ఇంకా ఇలాగె పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితు వస్తే వాహనదారులకు మంచి రోజులు వస్తాయి అని అంటున్నారు మార్కెట్ నిపుణులు.. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత మాత్రం తగ్గుతాయి.. లేదా ఇంకా పెరుగుతాయా అనేది చూడాలి. ఏది ఏమైనా వారంలో రూపాయి తగ్గింది అంటే గ్రేట్.  

మరింత సమాచారం తెలుసుకోండి: