ఒకప్పుడు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కావాలంటే బ్యాంకుకు వెళ్లి అక్కడ విత్డ్ డ్రా వోచర్  రాశి... అది ఖాత బుక్ తో సహా బ్యాంకు సిబ్బందికి అందిస్తే క్యాష్ కౌంటర్ నుంచి డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా... అబ్బే ఇప్పుడు బ్యాంకులకు ఎందుకు వెళ్తామండి   ఎక్కడ పడితే అక్కడ ఏటీఎం సదుపాయాలు ఉండగా అంటుంటారు జనాలు. అయితే ప్రస్తుతం ఎక్కువమంది ఏటీఎం ద్వారానే డబ్బులు విత్డ్ డ్రా  చేసుకోవడం లేదా డబ్బులు డిపాజిట్ చేయడం లాంటివి చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్ యాప్ లు ఎన్నో వచ్చాయి. ఏ చిన్న పని కావాలన్న ఆన్లైన్ పేమెంట్ యాప్ ల ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి . ఇండియా కాస్త డిజిటల్ ఇండియా గా మారిపోతుంది. 

 

 

 కానీ అక్కడక్కడా కొంతమంది మాత్రం ఇలాంటి ఆన్లైన్ యాప్స్  వాడకుండా.. నగదు  స్వీకరిస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ల దగ్గర మనం ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కానీ ఇంకా ఏదైనా అవసరం పడినప్పుడు కానీ నగదు  అవసరం ఉంటుంది. కాబట్టి దగ్గర్లో ఉన్న ఏటీఎం దగ్గరకు వెళ్లి తీసుకుంటూ ఉంటాం. అయితే ఏటీఎం ద్వారా ఎలాంటి ఫెసిలిటీస్ అందుతాయో మాత్రం చాలామందికి తెలియదు. ఏటీఎం దగ్గరకు వెళ్లి డబ్బును విత్ డ్రా  చేసుకోవడమే ఎక్కువ మందికి తెలిసిన విషయం. కానీ ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా  చేసుకోవడమె  కాదు మరిన్ని సేవలు పొందవచ్చు అనేది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. 

 

 

 అయితే ఏటీఎం ద్వారా కేవలం డబ్బులను విత్ డ్రా  చేసుకోవడమే కాదు మరెన్నో సేవలను వినియోగదారులు పొందవచ్చు. ఇంతకీ ఆ సేవలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసుకోవడం లేదా డబ్బులు డిపాజిట్ చేయడం లాంటివి కాకుండా... మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం.. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం లాంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అంతేకాకుండా చెక్ బుక్ కోసం బ్యాంక్ కి  అభ్యర్థన కూడా ఏటీఎం నుంచి చేసుకోవచ్చు. ఇక పర్సనల్ లోన్  కూడా ఏటీఎం నుంచి దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది. ఏటీఎం నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా వేయడానికి వెసులుబాటు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: