తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రత్యర్థులు అందరూ ప్రచార జోరు పెంచుతున్నాడు. గెలుపే లక్ష్యంగా ఎన్నో ప్రణాళికలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు అభ్యర్థులు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో అందరూ సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు. ఎందుకంటే ఓటర్లను ఎంతగా ఆకట్టుకుంటే విజయం అంతలా అభ్యర్థుల దరి చేరుతుంది కాబట్టి... ప్రచార రంగంలో దూసుకుపోతున్న ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఖర్చు విషయంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయడం లేదు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు. 

 

 

 గతంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల కంటే ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జోరుగా నడుస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం అందరిని బుట్టలో వేసుకోవడం కోసం భారీగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కదా. దీని కోసం ఎంతో మంది అభ్యర్థులు ప్లాట్లు భూములు ఇళ్ళు  అమ్ముకుని మరి ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. తమ తమ మున్సిపాలిటీలోని ఓటర్లకు గాలం వేసేందుకు బంపర్ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివార్లలోని మున్సిపాలిటీలో అయితే... మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. 

 

 

 హైదరాబాద్ నగర శివార్లలోని మున్సిపాలిటీలో అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే ఏకంగా లక్ష రూపాయల వరకు ఇస్తామని ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. అంతే కాకుండా మరికొన్ని చోట్ల ఒక్క ఓటుకి 30000 లేదా తులం బంగారం ఇస్తామని అభ్యర్థులు ఓటర్లకు ఆఫర్లు ఇస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా గతంలో జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోటీ చేసే అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లను ఆకర్షించి విజయాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నారు అందరూ అభ్యర్థులు.

మరింత సమాచారం తెలుసుకోండి: