ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల బరిలో అభ్యర్థులందరూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రచార హోరు మొదలవడంతో అభ్యర్థులందరూ ప్రచార రంగంలో తమదైన స్టైల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులందరూ మున్సిపల్ ఎన్నికల్లో తమదే విజయమని అంటూ ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఇక అన్ని పార్టీల ముఖ్యనేతలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ మహాశయులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో  ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని అన్ని పార్టీలు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి. 

 

 

 ఇక పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పలు చోట్ల ఇప్పటికే అభ్యర్థులు ఏకపక్షం అయిపోయారు కూడా. కొంతమంది పోటీ చేయడానికి అభ్యర్థులు ఎవరూ లేక ఏక పక్షంగా ఎన్నుకోబడితే...  ఇంకొంత మంది ఇతర పార్టీల నేతల మద్దతుతో ఏకపక్షంగా ఎన్నుకోబడిన వారు ఉన్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ లో ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఐడీఏ బొల్లారం పురపాలక ఎన్నికల్లో  ఎవరూ ఊహించని విధంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 

 

 

 

 ఐడియా బొల్లారం లోని 17వ వార్డు నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలోకి దిగారు... అయితే బీజేపీ నుంచి బరిలోకి దిగి... టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న బజరంగి చౌదరి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అందరు  షాక్ కి గురయ్యారు. తాను పొట్ట చేతపట్టుకుని నగరానికి వచ్చానని రాజకీయాలు చేయడానికి కాదు అని తెలిపిన భజరంగీ చౌదరి.. పటాన్ చెర్  నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కారెక్కారు . దీంతో 17వ వార్డు లో పోటీ ఏకపక్షం అయిపోయింది. టిఆర్ఎస్ అభ్యర్థి ఏకపక్షంగా విజయం సాధించినట్లు అయింది. ఇకపోతే ఈ సందర్భంగా మాట్లాడిన గూడెం మహిపాల్ రెడ్డి... కాంగ్రెస్ బిజెపి పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేక బలవంతంగా కొంతమందిని అభ్యర్థులుగా బరిలోకి దింపాయని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: