డబ్బును పొదుపు చేస్తే సంపద వస్తుందని చాలమంది భావిస్తారు. అయితే వాస్తవ దృష్టిలోకి వెళ్ళి అన్వేషిస్తే డబ్బును పొదుపు చేసిన ప్రతివ్యక్తి  ధనవంతుడు కాలేడు. డబ్బు సంపాదన  రకరకాల  మార్గాలు  అన్వేషించకపోతే ఏవక్తి ధనవంతుడు కాలేడు. అంతేకాదు కేవలం డబ్బు 
దాచటం మాత్రమే తెలిసిన వ్యక్తి ఎట్టి పరిస్థితులలో ధనవంతుడు కాలేడు. ఆ పొదుపు చేసిన డబ్బుని తెలివిగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలిసినవాడే ధనవంతుడుగా మారగలుగుతాడు. 

కొంతమంది తమకు ఎంతో అనుభవం ఉన్నా ఎందుకు రాణించలేక పోయామని బాధపడుతూ ఉంటారు.  అయితీ అలాంటి వ్యక్తులు జీవితంలో ఎదిగి ధనవంతులు కావడానికి వాళ్ళ ఎక్స్ పీరియన్స్ తో సంబంధం ఉండదు. అంతేకాదు ఏవ్యక్తి అయినా  తాను ఏర్పరచుకున్న  గోల్ ను సీరియస్ గా తీసుకుంటాడో ఉంటాడో అతడే విజేత మారగలుగుతాడు.  ఇక్కడ మరొక విషయం గుర్తు పెట్టుకోవాలి.  

 మనలో చాలా మంది మనకు అక్కర్లేని వస్తువులను కొన్ని ప్రేస్టిజ్లకు పోయి కొంటాం దాని వల్ల ఆ సమయానికి ఆనందం ఉన్నా పోనుపోను మనకే అనిపిస్తుంది. వీటిని కొనడం కన్నా ఎందులో అయినా ఇన్వెస్ట్ చేస్తే బాగుండేది అన్న అభిప్రాయం కలుగుతుంది.  దీనితో  ఏదైనా కొనే ఒక వస్తువు కొనే ముందు ఒకసారి   నిజంగా ఆ వస్తువు మనకు అవసరామా కాదా అన్న అలోచన చేసివారు మాత్రే పొదుపు చేయగలిగి సంపద  పెంచుకోగలుగుతారు. వాస్తవానికి జీతంలో  ఎదగాలి అంటే ఎప్పుడు నిరంతరం మన పనిలో మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడు అయితే మనం నేర్చుకోవడానికి ఏమిలేదు అంటూ ఆపేస్తామో అప్పుడే  మన ఎదగటం కష్టం అయిపోతుంది. 

 వాస్తవంగా ఆలోచిస్తే  ఫాస్ట్ గా ఎవరు రిచ్ అవ్వలేరు లాటరి తగిలితే తప్ప. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ధనవంతుడు అవ్వాలి అంటే ఒకటే దారి అది చాలా కష్టంగా ఉంటుంది. అయిదు పది లేదా పదిహేను ఏళ్ళ లో ఇంత సంపాదించాలి అని ఒక టార్గెట్ పెట్టుకుని పరుగులు తీసే వ్యక్తి మాత్రమే ధనవంతుడు కాగలుగుతాడు. ఇలా మనలను ధన వంతుడు కాకుండా అడ్డుకుంటున్న ఈ కారణాలను జయిస్తే ఎవరైనా ధన వంతుడు కాగలరు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: