తెలంగాణ‌లో జ‌రుగుతున్న మున్సిప‌ల్ ఎన్నిక‌లు అనేక ప్ర‌త్యేక‌త‌ల‌ను న‌మోదు చేసుకుంటున్నాయి. తెలంగాణ‌లో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఆయా పార్టీల  శ్రేణులు గడపగడపకూ వెళ్తూ నేరుగా ఓటర్లను కలుస్తూ ఓట్లు అభ్య‌ర్థిస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఎంఐఎం పార్టీకి సంబంధించి ఆస‌క్తిక‌ర స‌మాచారం వెలుగులోకి వ‌చ్చింది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐఎం 286 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ పోటీచేస్తున్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే, జాతీయ పార్టీలైన party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ, సీపీఎం కంటే అధికంగా ఎంఐఎం నేత‌లు బ‌రిలో ఉండ‌టం అస‌లు విష‌యం.

 

 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 44 మున్సిపాలిటీలు, నాలుగు కార్పొరేషన్లలో ఎంఐఎం అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. భైంసా, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, జల్‌పల్లి, తాండూరు, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, జనగామ, జగిత్యాల, మెట్‌పల్లి, రామగుండం, నల్లగొండ మున్సిపాలిటీల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఏకంగా భైంసాలో తిరిగి మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భైంసాలో ఇప్పటికే మూడువార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందడం ఎంఐఎం జోరుకు నిద‌ర్శ‌నం.

 

మ‌రోవైపు తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఈ స్థానిక పోరులో party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ, సీపీఎం కంటే ఎక్కువ స్థానాల్లో మజ్లిస్‌ బరిలో నిలిచింది. మజ్లిస్‌ 286 మందిని పురపోరులో నిలిపింది. party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ 177 స్థానాల్లో, సీపీఎం 166 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. కాగా, తెలంగాణ‌లో వామ‌ప‌క్షాల కంటే ఎంఐఎం పార్టీకే ఎక్కువ ప‌ట్టు ఉంద‌నే విష‌యం ఈ పోరుతో స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని అంటున్నారు.

 

 

కాగా, కామారెడ్డి మున్సిపాలిటీలో పోటీచేస్తున్న ఆరుగురు ఎంఐఎం అభ్యర్థుల గెలుపు కోసం శనివారం నిర్వహించిన ప్రచార సభకు మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏపై ఈ నెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికలను బీజేపీ రెఫరెండంగా తీసుకోవాలని సవాల్‌ విసిరారు. తెలంగాణలో ఏ ఒక్కచోట బీజేపీకి మున్సిపల్‌ పీఠం దక్కబోదని జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: