రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యంలో వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు అంతా కలిసి కొద్దీ రోజులుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో వైసిపి అధినేత జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. దీనిని ప్రజలు అర్ధం చేసుకున్నా వైసీపీని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో  టిడిపి ఆ ప్రాంత రైతులను రెచ్చగొడుతూ, వారిలో లేనిపోని భయాలను కలిగిస్తూ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలంటూ రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

 

 అయితే ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకులు ప్రతి విమర్శలు పెద్దగా చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టిడిపికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేలా ఆదివారం మూడు రాజధానులకు మద్దతుగా విజయవాడలో వైసిపి నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అమరావతికి ఎటువంటి అన్యాయం జరగదని, రాజదానిపై తప్పుడు నివేదికలు ఇచ్చే సంస్కృతి చంద్రబాబుకే ఉందని, ప్రజలంతా పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నారని, కానీ చంద్రబాబు రాజకీయ లబ్దికోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

 

 రేపు టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు సిద్ధంగా లేరని జగన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి మేమంతా ఉంటామని ఆయన ప్రకటించారు. చంద్రబాబు ఇప్పుడు అమరావతి పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, రైతులను చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారు త్వరలోనే బయటపడుతుంది వెల్లంపల్లి చెప్పారు. ఈ కార్యక్రమానికి భారీగా జనం రావడంతో వైసిపి నాయకులు ఉత్సాహం కనిపించింది. ఇక రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం టీడీపీ తలపెట్టిన నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు ఈ మద్దతు ర్యాలీ మొదలుపెట్టడం టీడీపీకి షాక్ కలిగించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: