ప్రపంచం మొత్తం ఆన్లైన్ మయం అయిపోతుంది. ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఆన్లైన్ ఒక్కటే అందరికీ ఒక దిక్కు అయిపోయింది. ఒకరోజు ఇంటర్నెట్ పని చేయలేదు అంటే భూకంపం వచ్చినంత పని అవుతుంది. అయితే ప్రస్తుతం మనుషుల మధ్య దూరం కూడా పెంచుతూ వస్తుంది ఇంటర్నెట్. ఇంటర్నెట్ సేవలు ప్రజలకు మరింత దగ్గర అయినప్పటినుంచి... ఇతరులను ఎక్కువగా కలవడం కంటే మొబైల్ ద్వారా చాటింగ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు నేటితరం జనాలు. ముఖ్యంగా ఆన్లైన్ చాటింగ్ ఆ యాప్స్ ని  ఉపయోగిస్తూ ఎవరిని కలవకుండా మాట్లాడకుండానే ఫోన్లోనే పబ్బం గడుపుతున్నారు. ప్రస్తుతం మన దేశ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగిస్తున్న ఆన్లైన్ మెసేజ్ యాప్  ఏది అంటే.. అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు వాట్సాప్. 

 

 

 వాట్స్అప్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది... ఆన్లైన్ లో ఎన్ని కొత్త మెసేజ్ యాప్స్ వచ్చినప్పటికీ వాట్సప్ కి మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. రోజుకు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది కానీ ఎక్కడా తగ్గడం లేదు. అటు వాట్సాప్ యాజమాన్యం కూడా వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తె mస్తుండడంతో మరింతగా వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్  మెసేజింగ్ యాప్ లన్నిటిలో వాట్సాప్ తన హవా నడిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎంతోమంది వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ వీడియో కాల్ లో  మాట్లాడుతూ పబ్బం గడిపేస్తున్న వారు చాలామందే . 

 

 

 ఫిబ్రవరి 1 నుంచి మాత్రం కొన్ని స్మార్ట్ ఫోన్లలో  వాట్సాప్ పని చేయదు. డిసెంబర్ 31 తర్వాత విండోస్ ఫోన్ లో వాట్సాప్ పని చేయడం ఆగిపోయింది. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా వచ్చే నెల 1వ తేదీ నుంచి వాట్సప్ పనిచేయడం మానేస్తుంది. 2.3.7 లేదా అంతకంటే తక్కువ ఆండ్రాయిడ్ వర్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో  ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ పనిచేయదు. ఐఓఎస్ 8 లేదా అంతకంటే తక్కువ ఉన్న మొబైల్లలో  కూడా ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ ఫోన్లు వాడే వారు తమ వాట్సాప్ చాటింగ్ లను  ముందే సేవ్ చేసుకోవాలని వాట్సాప్ సంస్థ సూచించింది. మరి మీ ఫోన్లో ఏ ఆపరేటింగ్ సిస్టం ఉందో ఒకసారి చెక్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: