వైసీపీలో కష్టపడి పనిచేసిన వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. అలాంటివారికి జగన్ ఎప్పుడు న్యాయం చేస్తూనే ఉంటారు. ఆ విషయం ఆయన అధికారంలోకి వచ్చాక స్పష్టంగానే కనిపిస్తుంది. తనని నమ్ముకున్నవారికి మంచి మంచి పదవులే ఇస్తున్నారు. అలాగే ఎన్నికల్లో టికెట్లు దొరకని వారికి, ఓడిపోయినవారికి కూడా జగన్ తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ స్థానాల బరిలో దిగి ఓటమి పాలైన వారు కూడా ఏదొక పదవి వస్తుందనే ఆశతో ఉన్నారు.

 

2019 ఎన్నికల్లో వైసీపీ మూడు ఎంపీ స్థానాల్లో ఓడిపోయింది. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు చేతిలో దువ్వాడ శ్రీనివాస్, విజయవాడ కేశినేని నాని చేతిలో పి‌వి‌పి, గుంటూరు గల్లా జయదేవ్ చేతిలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు ఓటమి పాలయ్యారు. ఇందులో పి‌వి‌పి బిజినెస్‌మ్యాన్ కాబట్టి ఆయనని పక్కనబెడితే... శ్రీకాకుళంలో ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ మొదటి నుంచి వైసీపీకి అండగా నిలుస్తూనే ఉన్నారు. 

 

పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న ఈయన...2014 ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేసి అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. ఓడిన పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. పైగా పార్టీ కూడా అధికారంలో ఉండటంతో ఎమ్మెల్సీ పదవి వస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక జగన్ కూడా దువ్వాడకు సరైన సమయంలో న్యాయం చేసేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ఇటు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విషయానికొస్తే..ఈయన 2009లో టీడీపీ తరుపున నరసారావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2014లో గుంటూరు వెస్ట్ నుంచి మళ్ళీ టీడీపీ నుంచి గెలిచారు. అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి వైసీపీలోకి వచ్చి గుంటూరు ఎంపీగా పోటీ చేసి గల్లా జయదేవ్ చేతిలో ఓటమి చవిచూశారు. అయితే ఓటమి పాలైన మోదుగుల కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చూస్తున్నారు. మరి జగన్ వీరిలో ఎవరికి పదవి ఇస్తారో ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: