ఢిల్లీ ఎన్నికలు ఎప్పుడు రసవత్తరంగానే సాగుతుంటాయి. ఢిల్లీలో పాగా వేసేందుకు రెండు దశాబ్దాలుగా బీజేపీ ప్రయత్నం చేస్తూనే ఉన్నది.  కానీ, ఆ ప్రయత్నాలు ఇవికూడా ఫలితాలు ఇవ్వడం లేదు.  కాంగ్రెస్ పార్టీ నేత షీలా దీక్షిత్ 15 ఏళ్ళు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసింది.  2015 ఆప్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది.  70 స్థానాలున్న అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాల్లో విజయం సాధించి రికార్డు సాధించింది.  ఇది ఆ పార్టీకి అద్భుతమైన విషయం అని చెప్పాలి.  15 ఏళ్ళు పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంకూడా గెలుచుకోలేదు.  బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించారు.

 

అయితే, అప్పట్లో ఆప్ సర్కార్ తో కలిసి పనిచేసిన సీనియర్ నేతలు, చరిష్మా నేతలు ఇప్పుడు కరువయ్యారు.  వారంతా ఇప్పుడు బయటకు వచ్చేశారు.  ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విధానాలు నచ్చడం లేదని, ఆయనతో కలిసి పనిచేయలేమని చెప్పి బయటకు వచ్చారు. ఇది ఆ పార్టీకి తీరని దెబ్బ అని చెప్పాలి.  ఎందుకంటే పార్టీలతో కలిసి పనిచేయడానికి వారు నిరాకరించడమే. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో ఇబ్బందులు పడుతున్నది.  

 

15 ఏళ్ళు వరసగా విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది.  ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.  ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోవడం అన్నది దారుణమైన విషయం.  ఆప్ లో సీనియర్ నేత, మహిళా నేత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరారు.  కేజ్రీవాల్ తీసుకుంటున్న నిర్ణయాలు ఢిల్లీకి ఉపయోగకరంగా లేవని అంటున్నారు.  అందుకే పార్టీ మారినట్టు అల్కాలంబ పేర్కొన్నది.  ఇది కేజ్రీవాల్ కు నష్టం కలిగించే అంశం అని చెప్పొచ్చు.

 

ఇకపోతే, బీజేపీ విషయానికి వస్తే ఎలాగైనా ఈసారి జెండా పాతాలని చూస్తున్నది.  గత ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.  కానీ, 2019 లో జరిగిన ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 7 పార్లమెంట్ నియోజక వర్గాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.  ఇది కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ అని చెప్పాలి.  ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.  అయితే, ఎంతవరకు ఈ పార్టీ విజయం సాధిస్తుంది అన్నది ఫిబ్రవరి 8 వ తేలిపోయింది.  ఆ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: