దేశంలోనే నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే  గిరిజన జాతర ములుగులో  జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర. కాగా  లక్షలాది మంది భక్తులతో సమ్మక్క సారక్క జాతర దేశవ్యాప్తంగా ఎంతో  ప్రసిద్ధి చెందింది. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు పై పోరు సలిపి వీర మరణం పొందిన సమ్మక్క సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుపుకుంటారు. కుంభమేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనేది సమ్మక్క సారక్క జాతరలోనే.  దీంతో 1996లో ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ జాతరను ప్రభుత్వ పండుగగా  తీర్మానించింది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గడ్,  ఒరిస్సామధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తుంటారు. మేడారం జాతర సందర్భంగా ఎంతో మంది భక్తజనంతో  జనసంద్రంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రాంతం. 

 

 విగ్రహాలు లేని తొలి జాతర కూడా సమ్మక్క సారలక్క జాతరే. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ భక్తి పారవశ్యంతో సమ్మక్క సారలమ్మ లకు మొక్కులు చెల్లించుకుంటారు. 2008 సంవత్సరంలో సమ్మక్క-సారలమ్మ జాతరకు 90 లక్షల మంది భక్తులు  వచ్చారు. సమ్మక్క సారలమ్మ జాతర అనగానే పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. సమ్మక్క సారక్కల గద్దె ఉన్న ప్రాంతం మొత్తం జనసంద్రంగా మారిపోతుంది కాబట్టి పోలీసుల అందరూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇకపోతే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించనున్నారు. కాగా జాతరకు ఇంకా చాలా రోజుల సమయం ఉన్నప్పటికి  కూడా ఇప్పటికే  సమ్మక్క సారలమ్మ గద్దెలు వద్దకు భక్తుల రాక భారీగా పెరిగింది.

 

 

 సమ్మక్క సారలమ్మ జాతర జరిగే  నాలుగు రోజుల పాటు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో భక్తులు... జాతరకు ముందుగానే సమ్మక్క సారలక్క గద్దెలు దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. దీంతో జాతరకు కొన్ని రోజుల ముందు నుంచే భక్త జనంతో నిండి పోతుంది సమ్మక్క సారలక్క గద్దెలు ఉన్న పరిసరప్రాంతాలు. ఇక వివిధ ప్రాంతాల నుంచి ముందుగానే సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచె  ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్ట పోలీసు బందోబస్తులో  డ్రోన్ కెమెరా నిఘాలో  భక్తులందరూ సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: