మూడు రాజ‌ధానుల ఏర్పాటును వ్య‌తిరేకిస్తూ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌లు ప్రాంతాల్లో ఆయ‌న నిర‌స‌న‌లు చేయ‌డంతో పాటుగా జోలెప‌ట్టి అమ‌రావ‌తి కోస‌మంటూ బిక్షాట‌న చేస్తున్నారు. అయితే, విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్‌ను చంద్ర‌బాబు వ్య‌తిరేకించ‌డంపై ఉత్త‌రాంధ్ర‌లో నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ప‌లువురు నేత‌లు భ‌గ్గుమంటున్నారు. తాజాగా శ్రీకాకుళంలో జ‌రిగిన ఆందోళ‌న‌లో చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది.

 

విశాఖను రాజధానిగా స్వాగతిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో శ్రీ‌కాకుళంలో ర్యాలీ నిర్వ‌హించారు. జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు , kiran KUMAR' target='_blank' title='గొర్లె కిరణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గొర్లె కిరణ్ కుమార్, డా.సీదిరి అప్పలరాజు, వైసీపీ జిల్లా పార్టీ ఆధ్యక్షురాలు కిల్లి కృపారాణి, డిసిఎంఎస్ ఛైర్మన్ పిరియా సాయిరాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీకి హాజరయ్యాయి. సూర్యమహల్ జంక్షన్ నుంచి సెవెన్ రోడ్డు జంక్షన్ వరకూ కొనసాగిన ర్యాలీ అనంత‌రం సెవెన్ రోడ్డు జంక్షన్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు నాయుడుకి మంత్రి ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు. దమ్ముంటే చంద్రబాబు త‌న‌పై నరసన్నపేటలో పోటీచేసి గెలవాల‌ని మంత్రి ధ‌ర్మ‌నా స‌వాల్ విసిరారు. 

 

స్థిరత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఎద్దేవా చేశారు. రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు పవన్ అని వ్యాఖ్యానించారు. మొన్నటి వరకూ చంద్రబాబు ఎలా ఆడిస్తే పవన్ అలా ఆడారని, ఇప్పుడు బీజేపీని అడ్డుపెట్టుకుని  లబ్ధి పొందాలనే తాపత్రయంలో ఉన్నాడని మండిప‌డ్డారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే కొద్దిమంది స్వార్థ‌పరులు, మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. 

కాగా, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను స్వాగతిస్తూ వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ...విశాఖ రాజధాని ఉత్తరాంధ్ర హక్కుగా అభివర్ణించారు. రాజ‌ధానిని వ్య‌తిరేకిస్తున్న‌ చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అసలు పుత్రుడు పనికిరాడని.. దత్తపుత్రుడిని రంగంలోకి దించారంటూ సెటైర్లు వేసిన మంత్రి అవంతి...ఓట్ల కోసం గాజువాక... రాజకీయాల కోసం అమరావతి కావాల్సి వచ్చిందా? అంటూ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. గాజువాక నియోజకవర్గ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: