ఎదుటి వ్యక్తి వేషధారణను బట్టి మనం ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు.  ఎదుటి మనిషి ఉన్న పద్దతిని అతని వ్యవహార శైలిని అర్ధం చేసుకోవాలి అంటుంటారు.  కానీ,అలా చేయలేమని ఇప్పటికే స్పష్టం అయ్యింది.  ఒక మనిషి చూడటానికి వికారంగా ఉండొచ్చు కానీ, అతనిలో గొప్ప మనసు ఉందేమో ఎవరు చెప్పొచ్చారు.  అలానే ఒకతను చూడటానికి అందంగా ఆకట్టుకునే విధంగా ఉండొచ్చు.  కానీ, అతను మనసు కుళ్ళు కుతంత్రాలతో నిండి ఉండొచ్చు.  


ఎవరు చెప్పొచ్చారు చెప్పండి.  ఒకమనిషి ఇలా ఉన్నాడు అంటే దానికి అర్ధం వేరుగా ఉంటుంది.  ఒక మనిషి అలా ఉండకూడదు అంటే మరోలా ఉంటుంది.  ఏది ఎలా ఉన్నప్పటికీ  మనం అర్ధం చేసుకునే దాంట్లోనే అన్ని ఉంటాయి.  దీనికి ఒక మంచి ఉదాహరణ ఇటీవలే పూరి జగన్నాథ దేవాలయం వద్ద జరిగింది.  పూరి జగన్నాథ దేవాలయం వద్ద కాషాయ వస్త్రాలు ధరించిన ఓ వ్యక్తికి రిక్షనడిపే వ్యక్తికీ మధ్య గొడవ జరిగింది.

 
ఈ గొడవకు దారి తీసిన అంశాలు ఏవైనప్పటికీ, ఈ గొడవ మాత్రం పెరిగి పెద్దదై పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.  వెంటనే పోలీసులు సదరు వ్యక్తిని ప్రశ్నించారు.  జరిగిన విషయాన్ని లిఖితపూర్వకంగా రాయమని ఇచ్చారు.  వెంటనే కాషాయ వస్త్రాలు ధరించిన ఆ వ్యక్తి జరిగిన విషయాన్ని పేపర్ పై రాసి ఇచ్చారు.  ఆ లెటర్ చూసి పోలీసులు ఖంగు తిన్నారు.  స్పష్టమైన ఇంగ్లీష్ లో ఉన్నది లెటర్.  షాకైన పోలీసులు అతని గురించి ఆరాతీయడం మొదలు పెట్టారు. 


అతను కొన్నాళ్ల క్రితం వరకు మిల్టన్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేసిన గిరిజా శంకర్ మిశ్రాగా గురించి.  అతని తండ్రిపోలీస్ ఆఫీసర్.  కొన్నాళ్ల క్రితం మరణించారు.  తల్లి కూడా మరణించింది.  అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు ఉన్నత స్థాయిలో ఉన్నారు.  అయితే, అతనికి మతి చెలించడంతో ఉద్యోగం మానేసి కాషాయం ధరించి ఇలా దేశంలో తిరుగుతున్నారు.  ప్రసిద్ధ దేవాలయాల వద్ద యాచకుడిగా జీవనం సాగిస్తున్నారు.  ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: