సాధారణంగా నేరస్తులు పోలీసుల నుంచి ఎంత వీలైతే అంత వరకు తప్పించుకుంటారు. కొన్ని సార్లు పరుగులు పెట్టిస్తుంటారు.  పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో గొడలు, మిద్దలు సైతం దూకి పారిపోతుంటారు.. తన్నులు తింటారు. అయినా ఎలాగో అలా వారిని ఛేజింగ్ చేసి దొంగలను అతి కష్టం మీద పట్టుకుంటారు. ఇది సినిమాల్లో కూడా చూపిస్తుంటారు.. భలే ఎంట్రటైన్ మెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా దొంగా పోలీస్ చేజింగ్ సీన్లు థియేటర్లో ఎన్నో రకాలుగా చూపిస్తుంటారు. కానీ ఒకదగ్గర మాత్రం పెద్ద ఐసిస్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు.. కానీ తర్వాత వారి తిప్పలు చెప్పనలవి కావు. వివరాల్లోకి వెళితే.. అధినాయకత్వం హతమైనా ఐసిస్ ఉగ్రవాద సంస్థ కు చెందిన  ముఫ్తీ అబు అబ్దుల్ బారీ నిజంగానే భారీ కాయం గల వ్యక్తి. 

 

అతని బరువు  250 కిలోల దాంతో అతన్ని అరెస్టు అయితే చేశారు కానీ తర్వాత పోలీసుల తిప్పలు మామూలుగా లేవు. అయితే అబ్దుల్ బారీ ఐసిస్ లో పని చేయడం అంటే.. గొడవలు.. బాంబులు విసరడాలు లాంటివి చేయరు.  చురుగ్గా కదల్లేడు కానీ, పదునైన మాటలతో ఎలాంటి వారినైనా రెచ్చగొట్టి ఉగ్రవాదం దిశగా నడిపించగల వాక్పటిమ ఉన్నవాడు. విద్వేష ప్రసంగాలు చేయడంతో అతను ఓ గొప్ప కలాకారుడు.  ఈ కారణంగానే ఐసిస్ లో అతడికి సముచిత స్థానం కల్పించారు.

 

అతడు మోసుల్ లో ఉన్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు వచ్చారు. అతడ్ని చూసిన తర్వాత ఎక్కడికీ పారిపోలేడని పోలీసులకు అర్థమైంది. దాంతో అతన్ని అరెస్టు చేసేందుకు వెళ్లారు. అయితే ఆయన ఊబకాయం చూసి అతడు ఎక్కడికీ పారిపోలేరని అర్థం అయ్యింది.  అరెస్ట్ అయితే చేశారు కానీ, అతడ్ని తమ కారులో ఎక్కించడం ఎలాగో పోలీసులకు తెలియలేదు. అన్నిరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత కారులో ఎక్కించే ఆలోచన విరమించుకుని, ఓ పికప్ ట్రక్ తెప్పించారు.  మొత్తానికి నానా ఇబ్బందులు పడి అందులో వేసి తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: