తెలంగాణాలో ఇప్పుడు మళ్ళీ కేటిఆర్ హవా మొదలయింది. రెండో సారి టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఆయన పాత్ర తగ్గింది అనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో కూడా కేటిఆర్ ని కెసిఆర్ పక్కన పెట్టారని ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేశారు. రాజకీయంగా టీఆర్ఎస్ తిరుగులేనంత‌ బలంగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు నాయకత్వ మార్పు అవసరం లేదనే భావనలో కెసిఆర్ ఉన్నారని అందుకే కేటిఆర్ ని త్వరగా ప్రభుత్వంలోకి తీసుకోలేదనే వ్యాఖ్యలు కొందరు చేశారు.

 

ఇక ఇప్పుడు మళ్ళీ కేటిఆర్ ప్రాధాన్యత పెరుగుతుంది. ఆయన్ను మంత్రిని చేయడమే కాకుండా వచ్చే ఏడాది ముఖ్యమంత్రిని కూడా చేసే అవకాశం ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొంద‌రు టీఆర్ఎస్ నేత‌లు సైతం కాబోయే ముఖ్య‌మంత్రి కేటీఆరే అని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. ఈ నేపధ్యంలో హరీష్ రావు గురించి ఇప్పుడు చర్చ ఎక్కువగా జరుగుతుంది. హరీష్ కి పట్టున్న జలవనరుల శాఖ కాదని, ఆర్ధిక శాఖ అప్పగించారు. ఇక ఇప్పుడు పార్టీలో రాజ్య‌స‌భ‌ ఎంపీ సంతోష్ పాత్రను పెంచుతున్నారు. 

 

ఎంపీ సంతోష్‌ చొరవతో అసెంబ్లీలో ప్లాస్టిక్ నిషేధం జరిగిందని ప్రచారం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ప్రభుత్వ నిర్ణయాల్లో, కొన్ని శాఖల్లో సంతోష్ రావు ప్రాధాన్యత అనేది క్రమంగా పెరుగుతూ వస్తోంద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. రాజకీయంగా ఇది ఏ సంకేతాలు ఇస్తుంది అనేది తెలియదు గాని... సోషల్ మీడియాలో మాత్రం అనేక అనుమానాలకు వేదికగా మారింది.

 

హరీష్ కి ప్రాధాన్యత సీనియర్లు కూడా తగ్గించారని ఏదైనా కావాలన్నా సరే సంతోష్ మాట్లాడుతున్నారని, హరీష్ సన్నిహితులు కూడా సంతోష్ కి దగ్గరవుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. రాజకీయంగా ఇది సంచలనాలకు ఇప్పుడు తెలంగాణాలో వేదిక అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మ‌రి ఇందులో వాస్త‌వ‌, అవాస్త‌వాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: