ఓ వైపు కార్చిచ్చు... మరోవైపు భారీ వర్షాలు ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. అయితే ... కార్చిచ్చుతో  అడవులు తగలబడిన ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో కొంచెం ఉపశమనం లభించినట్లయింది. 

 

ఆస్ట్రేలియాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్‌ లాండ్  రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా క్వీన్స్‌లాండ్‌లో ప్రధాన రహదారులను  మూసివేశారు. వరదలు ముంచెత్తటంతో జనజీవనం స్తంభించిపోయింది. వరదల కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఐతే...కొన్ని ప్రాంతాల్లో మాత్రం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. న్యూ సౌత్ వేల్స్ రాజధాని సిడ్నీలో భారీ వర్షపాతం నమోదైంది.

 

ఇక...ఆస్ట్రేలియాలో రాజుకున్న కార్చిచ్చుతో అల్లాడిన మూగజీవాలకు వర్షాల రూపంలో  ఉపశమనం లభించింది. ఐతే...దీన్ని ఆనందించేలోపే.. ఆ వర్షాలు కూడా వరదలుగా మారి ఇబ్బంది  పెట్టేస్థాయికి చేరుకున్నాయి. మొన్నటి వరకు అగ్ని కీలల నుంచి తప్పించుకోలేక తిప్పలు పడిన  జంతువులకు తాజాగా వరదల నుంచి కూడా తిప్పలు తప్పడం లేదు.

 

మరోవైపు...కార్చిచ్చుతో తగలబడిపోతోన్న ఆస్ట్రేలియాలో కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు  కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కార్చిచ్చు తగ్గుముఖం పట్టే అవకాశముంది. దావానలంలా  వ్యాప్తిస్తున్న కార్చిచ్చుతో వణికిపోతున్న ఆస్ట్రేలియాకు వర్షం రూపంలో కాస్త ఊరట లభించింది.  వర్షాలతో వాతావరణం సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రజలు ఆనందం వ్యక్తం  చేస్తున్నారు.

 

 కార్చిచ్చుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తూర్పు ఆస్ట్రేలియాలో వాతావరణ పరిస్థితుల్లో  మార్పులు వచ్చాయి. దావానలంతో దగ్ధమైన ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. మరిన్ని రోజులు  వానలు కురిసే అవకాశం ఉంది. కార్చిచ్చుతో వెలువడిన పొగ కారణంగా ఆస్ట్రేలియాలో గాలినాణ్యత  గణనీయంగా పడిపోయింది. కార్చిచ్చుతో  అడవులు తగలబడిన ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో కొంచెం ఉపశమనం లభించినట్లయింది. తాజాగా వచ్చిన మార్పులతో ఈ వారాంతంలో వర్షాలు ఏకధాటిగా  కురిస్తే.. దావానలం కొంతైనా తగ్గుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: