ప్రస్తుతం తెలంగాణలో మళ్లీ రాజకీయం వేడెక్కి పోతుంది.  గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపి, టీఆర్ఎస్ ల మద్య బీభత్సమైన పోటీ జరిగింది. అయితే అధికార పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా ఏర్పడింది.  కానీ టీఆర్ఎస్ పై ప్రజలు ఉంచిన నమ్మకం ముందు చెయ్యి గుర్తు దారుణంగా ఓడిపోయింది.  ఓ వైపు పార్టీ పగ్గాల విషయంలో అంతర్గత కుమ్ములాటలు.. మరోవైపు పార్టీ నుంచి గెలిచిన వారు అధికార పార్టీలోకి జంపింగులు.. ఇలా మొత్తానికి కాంగ్రెస్ ని ఎత్తు కుదేసినట్లు అయ్యింది.  ఈ నేపథ్యంలో కమలం కూడా ఎంపి ఎన్నికల్లో విరిసింది.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆదిపత్యం కోసం బిజెపి ఎన్నో వ్యూహాలు పన్నుతున్న విషయం తెలిసిందే.

 

ఈ  నేపథ్యంలో కరీంనగర్ బిజెపి ఎంపీ బండి సంజయ్ ప్రతి విషయంలోనూ అధికార పార్టీపై ఉవ్వెత్తున ఎగిరి పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ లెటర్‌హెడ్ అంటేనే కేంద్ర మంత్రులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇష్టంవచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం మాని అభివృద్ధి పనుల కార్యాచరణపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సంజయ్ లెటర్‌హెడ్‌లో అన్నీ తప్పుడు ఫిర్యాదులే ఉంటాయని అన్నారు.

 

ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్.  గత కొంత కాలంగా బండి వర్సెస్ గంగుల మద్య అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉన్నదో తెలిసిందే. ఈ నేపథ్యంలో గడిచిన ఎనిమిది నెలల్లో కరీంనగర్ అభివృద్ధి కోసం ఎంపీ సంజయ్ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎన్నికల్లో లబ్ది పొందేందుకు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకుని అభివృద్ధిపై దృష్టిపెట్టాలంటూ ఎంపీకి మంత్రి హితవు చెప్పారు. ఇక నుంచైనా వ్యక్తిగత దూషనలు ఆపి కరీంనగర్ అభివృద్ది ఎలా చేయాలో ఆలోచించుకోవాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: