మరో మూడు రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  ఉన్న కొంత సమయం లోనైనా ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు. అధికార ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా ఓటర్లను ఆకట్టుకుని  విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు ఖర్చు కూడా వెనకాడడం లేదు. ఎన్నికల ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ పార్టీ ముఖ్య నేతలందరినీ ప్రచార రంగంలోకి దింపి  ఓటర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యనేతలతో ప్రసంగాలు ఇప్పిస్తున్నారు. 

 

 అటు టిఆర్ఎస్ పార్టీ తో పాటు బిజెపి కాంగ్రెస్ పార్టీల ముఖ్యనేతలు కూడా ప్రచార రంగంలో దిగి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక అందరు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.  అయితే టిఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మధ్య గత కొంత కాలంగా తీవ్ర మాటలు యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు . ఇక ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వీరి మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారింది. 

 


 తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెరాస మంత్రి . తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై విమర్శలు చేసారు గంగుల కమలాకర్.తమపై  అనుచిత  వ్యాఖ్యలు చేయడం మాని  అభివృద్ధి పనులు కార్యాచరణపై దృష్టి పెట్టాలి అంటు  హితవు పలికారు. బండి సంజయ్ నుంచి లెటర్ హెడ్ అంటేనే కేంద్ర మంత్రులు అందరూ భయపడిపోతున్నారని ... బండి సంజయ్ లేఖలో అని తప్పుడు ఫిర్యాదులేనంటూ  విమర్శించారు గంగుల కమలాకర్.8 నెలల కాలంలో పార్లమెంటు నియోజకవర్గంలో బండి సంజయ్ ఎంత అభివృద్ధి చేసాడు... కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకు వచ్చాడో  వెల్లడించాలని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: