అదృష్టం కలిసి వస్తే.. ఆ భగవంతుడు కూడా చెడగొట్టలేరు.. దురదృష్టవంతుడిని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు.. ఈ సామెత అందరికీ తెలిసిందే.  అయితే కొన్ని సార్లు అదృష్టం కోట్లు కురిపిస్తున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా 1937 వ సంవత్సరం బ్రిటన్ రాజు ఎడ్వర్డ్-8 బొమ్మ ఓ నాణెం పై ముద్రించిగా ఆ నాణెం విలువ ఇప్పుడు రూ.9.10 కోట్ల పలికింది.  ఆరు కాయిన్స్‌లో ఒకటైన ఇది ఎడ్వర్డ్ 1936లో రాజుగా ఉన్న సమయంలో తయారు చేయబడింది. ఇవి 1937, జనవరి 1 నుంచి అందుబాటులోకి రావాల్సి ఉండగా.. కింగ్ ఎడ్వర్డ్ అమెరికన్ మహిళ విల్లిస్ సింప్సన్‌ను పెళ్లి చేసుకునేందుకు ఏకంగా తన సింహాసనాన్నే త్యాగం చేయడంతో వీటి ఉత్పత్తి ఆగిపోయిందని అంటుంటారు.

 

బ్రిటన్ రాజు ఎడ్వర్డ్-8 బొమ్మ ముద్రించిన బంగారు నాణెం టీవల జరిగిన వేలంలో ఓ వ్యక్తి  రూ.9.10 కోట్లకు దక్కించుకున్నాడు. తాజాగా ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే పేరు, ఇతర వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వ్యక్తి సొంతం చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా, ఇక లండన్ మ్యూజియం నిర్వాహకురాలు ఒకరు మాట్లాడుతూ.. ‘ఎడ్వర్డ్ బొమ్మ కలిగిన ఈ కాయిన్స్ ప్రపంచంలోనే అరుదైనవని అన్నారు.

 

ఇలాంటివి ఆరు నాణేలు మాత్రమే ఉండగా.. అందులో నాలుగు తమ మ్యూజియంలో ఉన్నాయని.. మిగతా రెండు ప్రైవేట్ వ్యక్తుల సొంతం చేసుకున్నారని తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి అరుదైన నాణెలు,  అబ్బుర పరిచే చిత్రాలు కోట్లు వెచ్చించి దక్కించుకోవడం ఈ మద్య కామన్ అయ్యింది.  గతంలో కూడా ప్రముఖులు వేసిన అపురూపమైన పెయింట్స్ కోట్లు వెచ్చించి ఔత్సాహికులు దక్కించుకున్నారు. ఏది ఏమైనా బ్రిటన్ రాజు ఎడ్వర్డ్-8 బొమ్మ కు ఏకంగా రూ.9.10  వెచ్చింది దక్కించుకున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కాని.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: