గత ఏడాది ఏపిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుబి మోగించింది. అధికార పార్టీ అయిన టీడీపీ చిత్తు చిత్తు గా ఓడిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటి సీఎంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పాలనలోకి వచ్చారు. కానీ ఆయన పరిపాలన ప్రజలు మెచ్చలేదు.. బాబు పాలనలో అడుగడుగునా మోసపోయామని ఆవేదన చెందారు. ఇదే సమయంలో ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలతో మమేకం అయ్యారు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.  ప్రజలకు భరోసా ఇస్తా ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి పాటుపడతా అని హామీ ఇచ్చారు. నవరత్నాల పథకం ప్రజలకు నచ్చడంతో ఎన్నికల్లో జగన్ కే జై కొట్టారు ఆంధ్రప్రజ.  అయితే సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు ఎంపి విజయసాయిరెడ్డి. 

 

గత కొంత కాలంగా టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై వైఎస్సాఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.  ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడు పచ్చ మీడియా అనే కీలు గుర్రం ఎక్కి స్వారీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రివ్వున ఎగిరనట్టు కలల్లో తేలిపోతున్నారు. గత ఆరు నెలల క్రితం ఆంధ్రప్రజ ఈ నేతలకు ఎలాంటి బుద్ది చెప్పిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అయినా బుద్ది రాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాాలు చేస్తున్నాని అన్నారు.  

 

మరో ట్వీట్‌లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ప్రధానులను డిసైడ్‌ చేశాను. రాష్ట్రపతులను సెలక్ట్‌ చేశానని డప్పుకొట్టుకునే వ్యక్తి ఇన్‌ సైడర్‌ భూములు కాపాడుకునేందుకు దిగజారి మాట్లాతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని కోరుకోవడం లేదట. కర్నూలు వాళ్లు జ్యూడీషియల్‌ క్యాపిటల్‌ వద్దేవద్దని ఈయన చెవిలో చెప్పారట అని చంద్రబాబును దుయ్యబట్టారు. మొత్తానికి జనసేన, టీడిపీ, బీజేపీ నేతలపై ఎంపి విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: