40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముప్పు తిప్పలు పెడుతున్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవం అంత వయసు కలిగిన జగన్ 2019 ఎన్నికలలో చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీని కోలుకునే స్థాయి లేకుండా కొద్దిలో ప్రతిపక్షం కూడా పోయే విధంగా ఏపీ ప్రతిపక్ష పాత్ర కి చంద్రబాబు ని ఫిక్స్ చేశాడు జగన్. ఇటువంటి నేపథ్యంలో విభజన తో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో తన వర్గ ప్రజలకు మరియు తన బినామీలకు మేలు చేకూరే విధంగా అమరావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి ఏమాత్రం రాజధానికి అనుకూలం లేని ప్రదేశంలో చంద్రబాబు దురుద్దేశంతో రాజధాని ఏర్పాటు చేయడం పట్ల వైయస్ జగన్ తీవ్రంగా విభేదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఒకే చోట అభివృద్ధి జరిగితే గతంలో హైదరాబాద్ విషయంలో జరిగిన నష్టం మళ్లీ జరుగుతుందని స్పష్టం చేసి మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకు రావడం జరిగింది.

 

దీంతో చంద్రబాబు అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండాలని తన పార్టీ నేతలతో తన వర్గ ప్రజలతో ధర్నాలు నిరసనలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని వైయస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకురావాలని భావించిన మిగతా ప్రాంతాలలో సరైన ఆదరణ లేకపోవడంతో...అమరావతి ప్రాంతంలో ధర్నాలో వియ్యంకుడు బాలకృష్ణ ను రంగంలోకి దింపి ఈనెల 16 నుండి 18 వరకు అమరావతి రాజధాని ప్రాంతాలు అయినా తుళ్లూరు.. మందడం.. నిడమర్రు.. పెదపరిమి.. రాయపూడి.. పెనుమాక.. ఉండవల్లి.. కృష్ణాయపాలెం భారీ ర్యాలీ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ సందర్భంలో బాలకృష్ణ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మీడియాకి కూడా బాలకృష్ణ పర్యటన గురించి స్పష్టం చేయగా.

 

అందరూ బాలకృష్ణ టూర్ గురించి రెడీ అవుతున్న తరుణంలో బాలయ్యబాబు చంద్రబాబు ని లైట్ గా తీసుకున్నట్లు ప్రస్తుతం టీడీపీ పార్టీలో వినబడుతున్న టాక్. సడన్ గా బాలకృష్ణ అమరావతి టూర్ క్యాన్సిల్ చేసుకోవడం జరిగినట్లు దానికి కారణం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు అన్నట్లు చంద్రబాబు చేస్తున్న ఆందోళనలకు నిరసనలకు రాష్ట్రంలో ఎటువంటి స్పందన లేకపోవడంతో అసెంబ్లీ సమావేశాల తర్వాత కుదిరితే అమరావతి ప్రాంతంలో ర్యాలీ చేయాలని బాలకృష్ణ డిసైడ్ అయినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: