ఇంకొన్ని రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచార రంగంలో దూసుకుపోతున్నాయి.  ఓటర్లను ఆకర్షించడమె  లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి అన్ని పార్టీలు. ఓటర్లను ఆకర్షించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఒక తాటిపై నడచింది లేదు.ఏకాభిప్రాయం కుదిరింది లేదు. అత్యవసరమైన సమయాల్లో  ఏకాభిప్రాయం కుదరక ఎప్పుడు కాంగ్రెస్ లో ఏదో ఒక లొల్లి  జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని అందరూ కీలక నేతలు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం బాగానే కష్టపడుతున్నారు. 

 

 

 

 కార్పొరేషన్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించి గెలిపించుకునే బాధితుల్లో  పార్టీలో సీనియర్ నాయకులైన పొన్నాల లక్ష్మయ్య,  దామోదర రాజనర్సింహ,  వి హనుమంతరావు,  షబ్బీర్ అలీ తదితరులు  బాధ్యతలు స్వీకరించినట్లు  తెలుస్తోంది. అయితే కార్పొరేషన్లో బాధ్యతలను తన స్థాయికి తగ్గది కావు అని మొదట మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంకి  బెట్టు చేసినప్పటికీ... ఇప్పుడు మాత్రం పార్టీ గెలుపుకోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు . అటు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో  గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తుండగా.. ఇంకొన్ని రోజుల్లో పీసీసీ మార్పు ఉన్న నేపథ్యంలో  తమ  బలం నిరూపించుకునేందుకు   మిగతా నేతలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

 

 

 అయితే పిసిసి ఆశావహుల్లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీ స్థానం పార్టీతో పాటు నల్గొండ అసెంబ్లీ పరిధిలో కూడా బాధ్యతలు చూస్తున్నారు. శ్రీధర్ బాబు కూడా తన  నియోజకవర్గంతో పాటు ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గ బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఇక మల్కాజ్గిరి కొండగల్ లో ప్రాంతాల్లో  కాంగ్రెస్ ను  గెలిపించె  పట్టుదలతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. వి  హనుమంత రావు,  దామోదర రాజనర్సింహ,  షబ్బీర్ అలీలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో సత్తా చాటితే పిసిసి పదవి దక్కించుకునేందుకు ఇది ఒక కారణంగా చూపొచ్చు అని కీలక నేతలు భావిస్తున్నారు. మరి నేతల్లో ఉత్సాహం పార్టీకి ఏ స్థాయిలో విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: