ఆరు నూరైనా  సూర్యాపేట మున్సిపాలిటీ అధికార పార్టీ జెండా ఎగురాల్సిందే ... లేకపోతే జగదీష్ రెడ్డి మంత్రి పదవికే ఎసరు వచ్చే ప్రమాదముంది . అసెంబ్లీ ఎన్నికల్లో అతికష్టం మీద నెగ్గిన మంత్రి జగదీష్ రెడ్డి , ఈ ఏడాదికాలం లో సూర్యాపేట పట్టణం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు . సూర్యాపేట లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం  తీవ్రంగా కృషి చేసి , అనుకున్నది సాధించారు . నగరం లో గతంలో శాంతిభద్రతల సమస్య ఉండగా , ప్రస్తుతం శాంతి భద్రతలను అదుపులో పెట్టేందుకు మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు .

 

సూర్యాపేట పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే , మరో నాలుగేళ్లు అధికారం లో ఉండే టీఆరెస్ అభ్యర్థులకే పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు . ప్రజల మూడ్ పరిశీలిస్తే ఒక్క  సూర్యాపేటనే కాదని ... జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం అంతఆషామాషి వ్యవహారమేమి కాదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు . హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని రెండు మున్సిపాలిటీల్లో హోరా , హోరీ పోరు తప్పదని చెబుతున్నారు . ఇక నల్గొండ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు .

 

అదే సమయం లో అయన భువనగిరి మున్సిపాలిటీ పై కూడా ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొంటున్నారు . మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు , చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ , టీఆరెస్ మధ్య గట్టి పోటీ నెలకొందని వెల్లడిస్తున్నారు . కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును  సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ప్రభావితం చేసే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు .   

మరింత సమాచారం తెలుసుకోండి: