ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా జన్మస్థలమని పేరొందిన పర్భణీ జిల్లాలోని పథ్రీని అభివృద్ధి చేయడానికి 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ వేడిని  వివాదాలను ఒక్కసారిగా పైకి లేవనెత్తి నట్లయింది. ఇటువంటి పరిస్థితుల్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుర్రాని అబ్దుల్లా ఖాన్ స్పందించారు. సాయిబాబా జన్మస్థలం పథ్రీనేనని చెప్పడానికి తమ దగ్గర 29 ఆధారాలతో కూడిన సాక్ష్యాలున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితులు ఆయన స్పందిస్తూ ఒకవేళ పథ్రీ అభివృద్ధి చెంది దానికి ప్రాధాన్యత లభిస్తే, శిరిడీ క్షేత్ర పాధాన్యత తగ్గుతుందని శిరిడీ వాసులు భయపడుతున్నారని పేర్కొన్నారు.

 

చరిత్ర ప్రకారం 1950 నుంచి బాబా పథ్రీలోనే ఉన్నారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని దుర్రాని అబ్దుల్లా ఖాన్ తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సమయంలో పథ్రీ అభివృద్ధి కోసం అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను రూ.100 కోట్లు అడిగారని ఆయన చెప్పారు.  అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న బాబా భక్తులు చాలామంది ఇతర ఇతర నగరాల నుంచి పథ్రీలో సాయిబాబా మందిరానికి సందర్శిస్తుంటారని అబ్దుల్లా ఖాన్ చెప్పారు.

 

అంతే కాకుండా ఎటువంటి వివాదాన్ని శిరిడి వాసులు ఎప్పటి నుండో చాలా కాలం బయటకు రాకుండా చేయాలని చూస్తున్నారని అబ్దుల్లా ఖాన్ చెప్పారు. మొత్తంమీద తాజాగా అబ్దుల్లా ఖాన్ చేసిన కామెంట్లు ఇప్పుడు జాతీయ స్థాయిలో మరియు అదే విధంగా మహారాష్ట్ర రాజకీయరంగంలో హాట్ టాపిక్ అయ్యాయి. అంతేకాకుండా షిరిడీ ప్రాంతంలో ఆందోళనలు మరియు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ విషయంపై స్థానికులతో మరియు అదే విధంగా ట్రస్ట్ సభ్యులతో మహారాష్ట్ర సీఎం ఓ త్వరలో చర్చలు జరపనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం నిరవధిక సమ్మె చేయడంతో సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: